స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాహుల్ మూవీ మేకర్స్ ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ ఫస్ట్‌లుక్ అండ్ ట్రైలర్ లాంచ్ దర్శకుడు సుకుమార్ చేతులమీదుగా హైదరాబాద్‌లో జరిగింది. కార్యక్రమంలో చిత్ర నిర్మాత బి ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ -మంచి సందేశమున్న కథతో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ తీశాం. నాకు తెలుగులో మూడో సినిమా ఇది. డైరెక్టర్ కరుణకుమార్ సినిమాను బాగా హ్యాండిల్ చేశాడు. హీరో శ్రీనాథ్ మాగంటి గొప్పగా నటించాడు. హరిప్రసాద్ మాకు మంచి కథ అందించారు. డబ్బు వస్తుందా? లేదా? అనే విషయాలు పక్కనపెడితే మంచి సినిమా తీశానన్న తృప్తి ఉందన్నారు. డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ -పోస్టర్, ట్రైలర్ బాగున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు సినిమాను తీసుకోవాలి అనుకునేలా అట్రాక్టుగా ఉంది. సినిమాకు కథ అందించిన హరిప్రసాద్ నాకు ‘నేనొక్కడినే, 100%లవ్’ చిత్రాలకు కథ అందించారు. దీన్నిబట్టి ఆయన కథలు ఎలా ఉంటాయో అంచనా వేయొచ్చు. డైరెక్టర్ కరుణకుమార్ ఈ కథను అద్భుతంగా తెరకెక్కించి ఉంటాడని భావిస్తున్నా అన్నారు.
డైరెక్టర్ కరుకుమార్ మాట్లాడుతూ -నిర్మాత ఓబుల్‌రెడ్డి సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. హీరో, హీరోయిన్లు, చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్స్‌కు కృతజ్ఞతలు. నా మిత్రుడు హరిప్రసాద్ చక్కటి మెసేజ్ ఉన్న కథను అందించాడు. సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని సినిమాలో చెప్పాం. అందరికీ ఈ పాయింట్ కనెక్టవుతుంది అన్నారు.