ఇదీ ట్రిపుల్ ఆర్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూ.ఎన్టీఆర్, రామచరణ్ కాంబినేషన్‌లో రాజవౌళి తెరకెక్కిస్తోన్న మల్టీస్టారర్ -ట్రిపుల్ ఆర్. వర్కింగ్ టైటిలే ఇంతకాలం టైటిల్‌గా వినిపిస్తూ వచ్చింది. అయితే, సినిమాకు సరిపోయే టైటిల్ మీరే పెట్టండంటూ ఫ్యాన్స్‌ను రాజవౌళి ఇంతకాలం ఎంటర్‌టైన్ చేస్తూ వచ్చాడు. వేచ్చ ఏడాది జూలై 30న సినిమా విడుదల చేస్తానని కూడా ముందే డేట్ ప్రకటించేశాడు. అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజా లీక్ ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చిత్రానికి ‘రామ రౌద్ర రుషితం’ టైటిల్‌ను రాజవౌళి సీరియస్‌గా పరిశీలిస్తున్నాడన్నదే ఆ లీక్ కంటెంట్. తెలుగేతర భాషల కోసం -రైజ్ రివోల్ట్ రివేంజ్ అన్న టైటిల్‌నూ పరిశీలిస్తున్నట్టు వినిపిస్తోంది. అయితే, కథకు సంబంధించి ఇది ఎంతవరకూ ఆప్ట్ అన్న అంశంపైనా సోషల్ మీడియాలో డిస్కషన్స్ మొదలయ్యాయి. అటు అల్లూరి సీతారామరాజు, ఇటు కొమురం భీమ్ -ఉద్యమ రూపాలకు ముందునాటి కాల్పానిక కథతో సినిమా ఉంటుందన్న విషయం ఎప్పుడో నిర్థారణ అయ్యింది కనుక -ఈ టైటిల్‌ను రాజవౌళి పరిశీలిస్తున్నాడా? అన్న సందేహాలూ లేకపోలేదు. పైగా వర్కింగ్ టైటిల్‌కు బాగా పాపులార్టీ వచ్చింది కనుక -ఇంత కష్టమైన టైటిల్ జనాల్లోకి వెళ్లడం సులువవుతుందా? అన్న సందేహాలూ లేకపోలేదు. సోషల్ మీడియాలో జరుగుతోన్న చర్చ ఎంత వరకూ వాస్తవమన్నది తెలియాలంటే -అధికారిక ప్రకటన వెలువడే వరకూ వేచి చూడాల్సిందే.