బాక్సర్‌గా వరుణ్‌తేజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేరుమారిన వాల్మీకి హిట్టుతో హ్యాపీ హైట్స్‌లోవున్న వరుణ్‌తేజ్ -గ్యాప్‌లేకుండా కొత్త సినిమా మొదలెట్టేశాడు. హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో వరుణ్ హీరోగా ఇటీవలే వచ్చిన గద్దలకొండ గణేశ్ సూపర్ సక్సెస్ సొంతం చేసుకోవడం తెలిసిందే. వరుస హిట్లిస్తోన్న ఊపు, ‘జిజి’ ఇచ్చిన ఉత్సాహంతో కొత్త ప్రాజెక్టును లైన్లో పెట్టేశాడు వరుణ్. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా తెరకెక్కనున్న కొత్త సినిమా -వరుణ్‌కి పదో ప్రాజెక్టు. సినిమా ప్రారంభానికి సంకేతంగా వరుణ్ తేజ్ అధికారిక ఇన్‌స్టా నుంచి బాక్సింగ్ పంచ్ పోస్టర్ వదల్తూ -బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కే కథగా స్పష్టతనిచ్చాడు. సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రానికి అల్లు అరవింద్ సమర్పకుడు. జార్జి, తమన్ సినిమాటోగ్రఫీ, సంగీతం సమకూరుస్తారు. లాంఛనంగా మొదలైన సినిమా డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలుపెట్టనుంది. జిజిలో ఊరమాస్ అప్పియరెన్స్‌తో అలరించిన వరుణ్‌తేజ్ -బాక్సర్ మేకోవర్ ఎలా చూపిస్తాడోనన్న ఆసక్తి మొదలైంది. కెరీర్ ఆరంభం నుంచి కథల ఎంపికలో వరుణ్ వైవిధ్యాన్ని చూపిస్తూనే ఉన్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా -కంచె నుంచి అంతరిక్షం వరకూ రొటీన్ జోనర్‌లకు భిన్నమైన కథలతోనే వరుణ్ ఆడియన్స్ ముందుకొస్తుండటం కనిపిస్తోంది. తన రెగ్యులర్ అప్పియరెన్స్‌కు భిన్నమైన ఊరమాస్ పాత్రతో జిజిలో అలరించిన వరుణ్ -ట్రెండ్‌కు తగినట్టుగా స్పోర్ట్స్ జోనర్‌ను ఎత్తుకుని బాక్సర్‌గా కనిపించనున్నాడు. వరుణ్‌తో జోడీ కట్టేదెవరో, ఎదురొచ్చేదెవరో ఆర్టిస్టుల వివరాలను చిత్రబృందం ప్రకటించాల్సి ఉంది.