బ్యూటీ..ఫుల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌గోపాల్ వర్మ ఒకప్పుడు తెరకెక్కించిన -రంగీలా సినిమాకు ఇప్పటికీ స్పెషల్ ఇమేజ్ ఉంది. అలాంటి రంగీలాకు ట్రిబ్యూట్‌గా మరో సినిమా తెరకెక్కుతోంది. అదే -బ్యూటిఫుల్. వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు సహ దర్శకత్వం అందించిన అగస్త్య మంజు -ఈ బ్యూటిఫుల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రచన, సినిమాటోగ్రఫీ బాధ్యతలూ అగస్త్య మంజు నిర్వహిస్తున్నాడు. టైగర్ -కంపెనీ ప్రొడక్షన్‌లో రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రంలో పార్థ్ సూరి, నైనా గంగూలీ హీరో హీరోయిన్లు. తాజాగా సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ సాధించింది. జోనర్‌ను ప్రతిబింబించే రొమాన్స్ కంటెంట్‌తో ట్రైలర్‌ను కట్ చేయడం యూత్‌ని టార్గెట్ చేసినట్టే ఉంది. సినిమాకి నరేశ్‌కుమార్, శ్రీధర్ నిర్మాతలు. షూటింగ్ పార్ట్ పూర్తవ్వడంతో -సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ దశలో ఉంది.