స్పెయిన్‌లో మిస్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుణ్‌తేజ్ కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు రూపొందిస్తున్న చిత్రం ‘మిస్టర్’. లావణ్య త్రిపాఠి, హెబాపటేల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో వెంకటేష్ క్లాప్‌నిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ, ఎన్నో ప్రత్యేకతలున్న కథ ఇదని, చాలా రోజుల తరువాత లవ్‌స్టోరీ విత్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నానని తెలిపారు. కథలో ఎమోషన్లకు ప్రాధాన్యత వుందని, వరుణ్‌తేజ్ గత చిత్రాలకు ఈ చిత్రానికి తేడా వుంటుందని అన్నారు. తొలి షెడ్యూల్ స్పెయిన్‌లోనూ, మలి షెడ్యూల్ బ్రెజిల్‌లోనూ, ఆ తరువాత ఎక్కువ శాతం షూటింగ్ కర్నాటక సరిహద్దులలో చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో తాను ఈ చిత్రంలో నటించడం ఆనందంగా వుందని, తప్పక అందరికీ నచ్చుతుందని కథానాయకుడు వరుణ్ తేజ్ అన్నారు. ప్రేమకథతోపాటు ఫ్యామిలీ డ్రామాతో కామెడీగా సాగే ఈ చిత్రంలో తన పాత్రకు ప్రాధాన్యత ఎంత వుందో, హీరోయిన్ల పాత్రలకు కూడా అంతే ప్రాధాన్యత వుంటాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో గోపీమోహన్, లావణ్య త్రిపాఠి చిత్ర విశేషాలను తెలిపారు. బోగవల్లి ప్రసాద్, ఆనంద్ ప్రసాద్, పరుచూరి ప్రసాద్, హీరో రానా తదితరులు పాల్గొన్నారు. నాజర్, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, పృధ్వీ, సత్యం రాజేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు:శ్రీ్ధర్ శీపాన, కథ:గోపీమోహన్, సంగీతం:మిక్కీ జె మేయర్, కెమెరా:జె.యువరాజ్, ఎడిటింగ్:ఎం.ఆర్.వర్మ, నిర్మాతలు:నల్లమలుపు బుజ్జి (శ్రీనివాస్), ఠాగూర్ మధు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:శ్రీను వైట్ల.

చిత్రం క్లాప్ కొట్టి మిస్టర్ సినిమా షూటింగ్ ప్రారంభించిన వెంకటేష్