విశాల్‌కు జోడీ కుదిరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళ భాషల్లో యాక్షన్, కుటుంబ కథా చిత్రాలతో అందరికీ దగ్గరైన హీరో విశాల్, తాజాగా సినిమాల విషయంలో స్పీడ్ పెంచేసి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తాజాగా ఆయన హీరోగా నటించనున్న ‘కత్తి సందై’ అనే సినిమాను ఈ ఉదయం దర్శక, నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో విశాల్ సరసన తమన్నా హీరోయిన్‌గా నటించనుందని తెలిసింది. తమిళంలో యాక్షన్ చిత్రాలు తీయడంలో మంచి పేరున్న దర్శకుడు సురాజ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా మే నెల మొదటివారంలో సెట్స్‌పైకి వెళుతుందని టీమ్ ప్రకటించింది. జగపతిబాబు ఓ ప్రధాన పాత్రలో నటించనుండడం ఓ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. పూర్తిగా యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాగా ఈ సినిమా ఉండనుందని టీమ్ స్పష్టం చేసింది. విశాల్ మాత్రం టాప్ హీరోయిన్లతో తన సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

చిత్రం తమన్నా