సరిలేరు.. శాంతికెవ్వరు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేడీ సూపర్‌స్టార్ హోదాలో స్క్రీన్‌కు దూరమైన నటి విజయశాంతి. అందం.. అభినయం రంగరించి చాలాకాలంపాటు తెలుగు ప్రేక్షుకులను మెప్పించిన ఆమె -పుష్కరకాలం తరువాత స్క్రీన్‌పై తళుక్కున మెరవనుంది. కెరీర్ ఆరంభంలో రొటీన్ నాయికా పాత్రలే చేసినా.. తరువాత డైనమిక్ రోల్స్‌కి కేరాఫ్ అడ్రెస్ అయ్యింది విజయశాంతి. 2006లో నాయుడమ్మ సినిమా తరువాత రాజకీయాల్లో బిజీ అయిన ఆమె, క్రమంగా సినిమాలకూ దూరమైంది. తాజాగా మహేష్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది విజయశాంతి. చాలాకాలం తరువాత స్క్రీన్‌కు వస్తోన్న డైనమిక్ యాక్ట్రెస్ కావడంతో -సినిమాలో ఆమె లుక్ కోసం అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. సీమ యాటిట్యూడ్‌ని బలంగా చూపించే మహిళగా పవర్‌ఫుల్ పాత్ర చేస్తోన్న విజయశాంతి ఫస్ట్‌లుక్‌ని దీపావళి స్పెషల్‌గా సరిలేరు నీకెవ్వరు చిత్రబృందం విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. మహేష్‌తో రష్మిక జోడీ కట్టిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదలకానుండటం తెలిసిందే.