కత్తిలాంటోడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతకాలంగానో ఊరిస్తున్న చిరంజీవి నటించనున్న 150వ సినిమాకు సంబంధించిన ప్రకటన ఎట్టకేలకు విడుదలైంది. సినిమాకు సంబంధించిన కథ, దర్శకుల విషయంలో అనేక తర్జన భర్జనలు జరిగిన ఈ సినిమాకు ఒక తుది రూపు లభించింది. శుక్రవారం ఉదయం చిరంజీవి స్వగృహంలో కుటుంబ సభ్యులు, స్నేహితులమధ్య, చిరంజీవి నటించనున్న 150వ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. స్వంత బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన తొలి సన్నివేశంపై పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్‌నివ్వగా, అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి నాగబాబు గౌరవ దర్శకత్వం వహించారు. తమిళంలో విజయవంతమైన ‘కత్తి’ చిత్రానికి రీమేక్‌గా నిర్మిస్తున్న ఈ సినిమాను 2017 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం పాత్రికేయుల సమావేశం లేకపోవడంతో చిత్ర విశేషాలు వివరించలేదు. ఈ చిత్రానికి సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్, కెమెరా బాధ్యతలు ఆర్.రత్నవేలు వహించనున్నారు. కార్యక్రమంలో వరుణ్‌తేజ్, సాయి ధరమ్‌తేజ్, కొరటాల శివ, శరత్ మరార్, డి.వి.వి.దానయ్య, తిరుపతి ప్రసాద్‌లతోపాటుగా కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు.

చిత్రం శుక్రవారం చిరంజీవి కొత్త సినిమాను క్లాప్ కొట్టి ప్రారంభిస్తున్న పరుచూరి వెంకటేశ్వరరావు