అప్పుడు ఇప్పుడు.. హిట్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుకె ఫిలింస్ పతాకంపై చలపతి పువ్వుల దర్శకత్వంలో సుజన్, తనిష్క్ జంటగా ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణంరాజు సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘అప్పుడు ఇప్పుడు’. ఫీల్‌గుడ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ జరుగుతున్నాయ. దసరా కానుగా విడుదలైన ఫస్ట్‌లుక్, దర్శకులు కె విశ్వనాథ్, కె.రాఘవేంద్రరావులు విడుదల చేసిన మొదటి, రెండో పాటకు అద్భుతమైన స్పందన వస్తోందని చిత్ర యూనిట్ తెలిపింది. తాజాగా మూడో పాటను హీరో సునీల్ విడుదలచేశారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ -టైటిల్ క్యాచీగా వుందని, పాటలందరికీ నచ్చేలా ఉన్నాయి కనుక సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం ఉందన్నారు. హీరో సునీల్ తమ సినిమాలో పాటను విడుదల చేయడం సంతోషంగా వుందని దర్శక నిర్మాతలు థాంక్స్ చెప్పారు.