ఖైదీ కనగరాజ్‌కు కమల్ ఆఫర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తీతో ఖైదీ చిత్రాన్ని తీసి హిట్ కొట్టిన దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఒక్క హిట్‌తోనే లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. ఆయనతో చిత్రాలు తీయడానికి తమిళంలో అగ్రహీరోలు సైతం పోటీపడుతుండటం విశేషం. తాజాగా తమ్ముడుతో హిట్ కొట్టిన దర్శకుడు, అన్న సూర్యతో కూడా ఓ చిత్రం రూపొందిస్తే బావుంటుందని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అందుకే తగ్గట్టుగా హీరో సూర్య కూడా దర్శకుడు కనకరాజ్ కోసం ఓ కథను సిద్ధం చేయించడానికి ముందుకు వచ్చాడు. తెలుగు, తమిళ భాషల్లో హిట్ అయిన ఖైదీ చిత్రంతో లోకేష్ కనకరాజ్ ప్రతిభగల దర్శకుడిగా నూటికి నూరుమార్కులు సాధించారు. తాజాగా ఖైదీ చిత్రానికి సీక్వెల్ వుంటుందని, హీరో కార్తీనే ప్రకటించాడు. దీంతో లోకేష్ కనకరాజ్‌తో మరోసారి హిట్ కొట్టాలని కార్తి కృతనిశ్చయంతో వున్నాడని అర్థమవుతుంది. ఇదే దర్శకుడికి అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్ కూడా ఓ భారీ ఆఫర్ ఇచ్చాడు. తన స్వంత బ్యానర్‌లో ఓ సినిమా చేయమని కమల్‌హాసన్ లోకేష్ కనకరాజ్‌ను ఆహ్వానించినట్లుగా కోలీవుడ్ సమాచారం. అయితే లోకేష్ కనకరాజ్ ఖైదీ సీక్వెల్ చేస్తాడా? లేక కమల్‌హాసన్ ప్రాజెక్టును పట్టాలపైకి ఎక్కిస్తాడా అనేది చర్చనీయాంశమైంది.