ఆంధ్రప్రదేశ్‌

టిడిపి నేత చిట్టిబాబు ఆకస్మిక మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 13: తెలుగుదేశం పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు,ప్రత్తిపాడు మాజీ శాసన సభ్యుడు పర్వత సత్యనారాయణమూర్తి (చిట్టిబాబు) ఆదివారం గుండెపోటుతో మరణించారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ని కాకినాడ నగరంలోని అపోలో ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలోనే కన్నుమూశారు. చిట్టిబాబుకు భార్య అన్నపూర్ణ, కుమారుడు రాజేష్, కుమార్తె కనకదుర్గ ఉన్నారు. స్థానిక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న చిట్టిబాబు శంఖవరం మండల పరిషత్ అధ్యక్షుడిగా,టిడిపి జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడిగాను వ్యవహరించారు. 2009 ఎన్నికల్లో టిడిపి నుండి ప్రత్తిపాడు అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి విజయం సాధించి 2014 వరకు ఎమ్మెల్యేగా సేవ చేశారు. తిరిగి 2014 ఎన్నికల్లో ప్రత్తిపాడు అసెంబ్లీ టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి చెందారు. అయితే తెలుగుదేశం అధికారంలోకి రావడంతో చిట్టిబాబును ఆ పార్టీ అధినేత చంద్రబాబు టిడిపి జిల్లా అధ్యక్షుడిగా నియమించారు.
ప్రజాసేవలో తరించిన నేత:బాబు
చిట్టిబాబు ప్రజా సేవలో అహర్నిశలు శ్రమిస్తూ తరించారని, ఆయన అకాల మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. చిట్టిబాబు ఆకస్మిక మృతి విషయం తెలియగానే ఢిల్లీలో ఉన్న చంద్రబాబు హుటాహుటీన ఆదివారం సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా శంఖవరం గ్రామానికి చేరుకున్నారు. చిట్టిబాబు స్వగృహంలో పార్ధివదేశాన్ని సందర్శించి, నివాళులర్పించారు. చిట్టిబాబు కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ లండన్ పర్యటనకు వెళ్ళిన తాను తిరుగు ప్రయాణంలో భాగంగా ఢిల్లీలో ఉండగా చిట్టిబాబు ఆకస్మిక మరణ వార్త తెలిసి షాక్‌కు గురయ్యానన్నారు. తెలుగుదేశానికి ఆయన ఎనలేని సేవలందించారన్నారు. అందర్నీ కలుపుకుని పోయే తత్వం చిట్టిబాబుదని, 24 గంటలూ ప్రజలకు చేరువలో ఉన్న నాయకుడని కొనియాడారు.
డిప్యూటీ సిఎం, యనమల ప్రభృతుల దిగ్భ్రాంతి
తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు చిట్టిబాబు మృతి పట్ల జిల్లాకు చెందిన పలువురు నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడుతో పాటు రాష్ట్ర మంత్రులు ఆవేదన, తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పార్టీకి, ప్రజలకు ఎంతో సేవలందించిన మాజీ ఎమ్మెల్యే చిట్టిబాబు హఠాన్మరణం పార్టీకి, ప్రజలకు తీరని లోటని చెప్పారు. (చిత్రం) చిట్టిబాబు పార్దివదేహం వద్ద నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు