చిత్తూరు

బాబుది విద్రోహ రాక్షస దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 19: ఆంధ్రప్రదేశ్‌కు మూడున్నరేళ్లుగా ప్రత్యేక హోదా రాకుండా, పోరాడిన వారిని అరెస్టులు చేస్తూ, అక్రమ కేసులు బనాయిస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం చేస్తున్న దీక్షకు ధర్మపోరాట దీక్ష అని కాకుండా విద్రోహ రాక్షస దీక్ష అని పేరు పెట్టుకోవాలని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం తొలి నుంచి పోరాడుతున్న వైకాపా అధ్యక్షుడు జగన్‌ను, నాయకులను, కార్యకర్తలను అడ్డుకుంటూ, భయపెడుతూ, దొంగ కేసులు పెట్టి జైల్లో పెట్టించిన ఘనత బాబుదన్నారు. వేదాలు దొంగిలించిన హిరణ్యాక్షుడే వేదాలు చెబుతానన్నట్లుగా ప్రత్యేకహోదా ఉద్యమాలను అడ్డుకున్న బాబు, ఆ ప్రత్యేకహోదా కోసం దీక్షలు చేస్తాననడం హాస్యాస్పదమన్నారు. ఆయన దీక్షలను ప్రజలు నమ్మరని, రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయం బాబు గుర్తించడంలేదన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాక్షసంగా ప్రవర్తించిన బాబు నేడు అధికారంలోకి వచ్చేసరికి ప్రతిపక్షాల ఆందోళనలు రాష్ట్భ్రావృద్ధికి ఆటంకమనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈనెల 16న జరిగిన రాష్ట్ర బంద్‌లో భాగంగా తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్‌ను దగ్ధం చేస్తే దానికి వైకాపాకు చెందిన నలుగురుని అరెస్టు చేయడం దారుణమన్నారు. ఉదయం 8 గంటలకు ఈ సంఘటన జరిగితే సీఎం క్యాబినెట్ సమావేశం తరువాత వైకాపా కార్యకర్తలను అరెస్టు చేశారన్నారు. క్యాబినెట్ సమావేశంలో చర్చించిన తరువాతే సీఎం ఒత్తిడి మేరకే పోలీసులు అరెస్టులు చేశారని ఆయన ఆరోపించారు. ఇది వైకాపా నాయకులు, కార్యకర్తలను అణచివేసేందుకు చేసిన కుట్రగా ఆయన ఆరోపించారు. పోలీసులను పచ్చ చొక్కాలు వేసుకున్నవారిగా మార్చి, వారిని వాడుకుంటున్నారని కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. బైక్‌ను కాల్చడం వల్ల రోడ్డు దెబ్బతిందని కేసులు పెట్టడం గమనిస్తే, భోగి పండుగనాడు రాష్ట్ర వ్యాప్తంగా భోగి మంటలు వేసిన 4 కోట్లమంది ప్రజలపై కేసులు పెట్టాల్సి వస్తుందన్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగానే మోటార్ బైక్‌ను దగ్ధం చేసిన వారిని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ అదే జరిగి ఉంటే తాను ఈ క్షణమే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లో లేని తమ పార్టీ వారిని అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. బాబుకు మార్పింగ్ చేయించడం కూడా తెలుసని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలను అరెస్టుచేసి దొంగలను నిలబెట్టినట్లు మీడియా ముందు నిలబెట్టారన్నారు. తుని ఘటన జరిగి ఇప్పటికి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదన్నారు. బాబుకు దమ్ము ఉంటే తుని ఘటనపై సీబీఐ చేతకాని, సిట్టింగ్ జడ్జి చేతకాని విచారణ జరిపించాలన్నారు. ఈ విచారణ సాగితే సీఎం, ఆయన తనయుడు లోకేష్‌లు జైలుకు వెళతారని ఆయన అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో వైకాపా నాయకులు ఎస్కేబాబు, రాజేంద్ర, యుగంధర్‌రెడ్డి, గోపియాదవ్, కుసుమ, గీత తదితరులు పాల్గొన్నారు.

మైనారీటీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
* రాష్ట్రం అప్పుల్లో ఉన్నా మైనారీటీల పథకాలు కొనసాగింపు
* చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్ స్పష్టం
చిత్తూరు, ఏప్రిల్ 19: మైనారీటీల అభివృధ్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చిత్తూరు ఎంపీ డాక్టర్ ఎన్.శివప్రసాద్ స్పష్టం చేశారు. గురువారం జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా టీడీపీ మైనారీటీ విభాగం సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముస్లీం మైనారీటీ వేషధారణలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీ శివప్రసాద్ మైనారీటీలను ఉద్ధేశించి మాట్లాడుతు కాంగ్రెస్ పాలనలో మైనారీలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవారని, టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి సంబంధిత వర్గాల అభివృద్ధిపై ప్రత్యేకశ్రద్ధ చూపిందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన కారణంగా పెద్దఎత్తున ఏర్పడిన ఆర్థికలోటును దృష్టిలో పెట్టుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో జత కలిశామని, కానీ మోదీ పాలనలో ముస్లీం మైనారీటీలతోపాటు ఇతర సామాజికవర్గాలు దారుణంగా అణచివేతుకు గురవుతుండటంతో ఆ పార్టీతో తెగతెంపులు చేసుకోవాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం తాను ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో రోజుకో వేషం ధరించి పలురీతుల్లో నిరసన వ్యక్తం చేశానని గుర్తుచేశారు. తొలినుంచి మైనారీటీలు టీడీపీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని, ఇకనుంచి కూడా అదే తరహాలో మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మైనారీటీ విభాగం నేతలు ఇక్భాల్, సయ్యద్ ఫైరోజ్, ఫర్వీన్‌తాజ్ తదితరులు పాల్గొన్నారు.