ఆంధ్రప్రదేశ్‌

సీఐడీ విచారణకు హాజరైన భూమన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: తుని విధ్వంసం కేసులో వైకాపా నేత భూమన కరుణాకర్‌ రెడ్డిని గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో అదనపు ఎస్పీ హరికృష్ణ విచారిస్తున్నారు. ఈనెల 6, 7 తేదీల్లో తనను విచారించిన సీఐడీ పోలీసులు తాజాగా మరోసారి పిలవటంతో మంగళవారం విచారణకు వచ్చినట్లు భూమన చెప్పారు. తనను అరెస్టు చేస్తే బయటకు వచ్చి కాపు రిజర్వేషన్ల కోసం పోరాడతానని మీడియాకు వెల్లడించారు. తుని విధ్వంసం కేసులో తనకు సంబంధం లేకపోయినా ముఖ్యమంత్రి కుట్రపన్ని తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని భూమన ఆరోపించారు. కాపు రిజర్వేషన్లకు వైకాపా నైతిక మద్దతు ఇచ్చిందని, దాన్ని అధికార పార్టీ సహించలేకే ఇలాంటి అరాచకాలకు పాల్పడుతోందని విమర్శించారు.