గుర్తింపులేదనే హక్కు ఎవరికీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభించి నాలుగేళ్లయిందని, దీనికి గుర్తింపు లేదనడం సరికాదని, ఆ సంస్థ అధ్యక్షుడు రామకృష్ణగౌడ్ అన్నారు. రెండు రాష్ట్రాలు విడిపోయిన తరువాత తాము పెట్టిన టిఎఫ్‌సిసికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆథరైజేషన్ కూడా పొందామని, తమ ఛాంబర్‌లో ‘అమ్మకు ప్రేమతో’, ‘దీక్ష’, ‘చిన్న చిన్న ఆశ’, ‘కోమలి’ లాంటి చిత్రాలకు సెన్సార్ కూడా చేశామని అన్నారు. తమ సంస్థకు గుర్తింపులేదని అనడానికి ఎవరికీ హక్కులేదని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రామకృష్ణగౌడ్ అన్నారు. తమ సంస్థకు ఎటువంటి గుర్తింపులేదని నిర్మాత సి.కల్యాణ్ అన్న మాటలకు ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ హాల్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పలు విషయాలు వివరించారు. ప్రధానమంత్రి ఆవాసయోజన స్కీం కింద 500 ఇళ్ళు నిర్మించి ఇళ్లు లేని నిర్మాతలకు, దర్శకులకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అందించామని, హెల్త్‌కార్డ్‌లు కూడా ఇప్పిస్తున్నామని, తమ సంస్థలో దాదాపువెయ్యి మంది సభ్యులు ఉన్నారని ఆయన తెలిపారు.
ఎన్నికలను అడ్డుకుంటున్నారు
సినిమా పరిశ్రమను దోచుకుంటున్న కొంతమంది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికలు జరుగకుండా ఆపుతున్నారని, డబ్బు ఖర్చుపెడుతున్నారని విమర్శించారు. అనేకమంది నిర్మాతలకు సినిమాలు విడుదల చేయడానికి థియేటర్లు దొరకడం లేదని, 200 సినిమాలు మూలనపడి ఉన్నాయని ఆయన అన్నారు. పక్క రాష్ట్రాల్లో డిజిటల్ ఛార్జీలు వారానికి 2500 వుంటే, మన దగ్గర 13వేలు వరకు వసూలు చేస్తున్నారని, వారిలో ముఖ్యంగా దగ్గుబాటి సురేష్‌బాబు, అల్లు అరవింద్, రమేష్ ప్రసాద్ లాంటి వారి చేతుల్లో థియేటర్లు వుండడంతో వారి ఇష్టారాజ్యం సాగుతోందని, లీజ్ వ్యవహారాలన్నీ వాళ్ల చేతిలోనే ఉన్నాయని ఆయన అన్నారు. ఇలా పరిశ్రమను అడ్డంపెట్టుకుని నెలకు దాదాపు 15 కోట్లు కొల్లగొడుతున్నారని, ఈ డబ్బులకు ఎక్కడా లెక్కలు చెప్పే అవసరం వారికి లేదని, టాక్సులు కూడా కట్టరని ఆయన అన్నారు. పోరాటం చేయడం వాళ్ల దృష్టిలో తప్పయితే, సమస్యలను పరిష్కరించకుండా పక్కదోవ పట్టిస్తున్నవారిని ఏమనాలని అన్నారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో అవకతవకలు అనేకం జరుగుతున్నాయని, వాటిని పరిష్కరించడానికి ఓ కమిటీ వేసిన సరైన ప్రయోజనం రాలేదని, 10, 15మంది కలిసి ఎల్‌ఎల్‌పి అని పెట్టి మొత్తం తెలుగు సినిమా నిర్మాతలకు నష్టంవచ్చేలా చేస్తున్నారని, ఇదంతా నిర్మాత సి.కల్యాణ్‌కు కనపడదా అని ఆయన ప్రశ్నించారు. దీనిపై ఆయన నోరు ఎందుకు మెదడంలేదని, తాము ఈ విషయంలో తీవ్రంగానే ప్రతిఘటిస్తున్నామని, డిజిటల్, ఎల్‌ఎల్‌పి, థియేటర్స్, లీజ్ విషయాలలో పరిష్కారాలు చేసి నిర్మాతలను బ్రతికించాలని, తద్వారా మీ నిజాయితీ నిరూపించుకోవాలని సవాలు విసురుతున్నామని ఆయన వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో పలువురు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు పాల్గొన్నారు.