రాష్ట్రీయం

అవినీతికి దూరంగా ఉండండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిడిఎల్‌పి సమావేశంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు ‘క్లాస్’

హైదరాబాద్, డిసెంబర్ 21: ‘అవినీతికి దూరంగా ఉండండి, మంత్రులు ఎమ్మెల్యేల ఫోన్లను లిఫ్ట్ చేయాలి..’ అని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాలులో జరిగిన ఎపి తెలుగు దేశం లెజిస్లేచర్ పార్టీ (టిడిఎల్‌పి) సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు, ఎమ్మెల్యేలకు చిన్న ‘క్లాసు’ తీసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ అవినీతికి దూరంగా ఉండాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు సూచించారు. ఎవరితో స్నేహం చేసినా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. చిన్న అంశం ఎంతో పెద్ద వివాదంగా మారుతుందని ఆయన తెలిపారు. కాల్ మనీ వ్యవహారం వంటి అంశాల్లో కాలు పెట్టరాదని, అనుచరులు, సొంత మనుషులు కూడా అటువంటి వివాదాల్లో ఉండకుండా చూసుకోవాలని అన్నారు. పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మంత్రులు జోక్యం చేసుకోరాదని ఆయన సూచించారు. మంత్రులు తమ నియోజకవర్గాల్లో తలదూరుస్తున్నారని, ఫోన్లు ఎత్తడం లేదని తనకు ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేల ఫోన్లను మంత్రులు లిఫ్ట్ చేయాలని ఆయన ఆదేశించారు. పార్టీ ఎమ్మెల్యేలను కలుపుకుని పోవాలని ఆయన మంత్రులకు సూచించారు. పార్టీ ఎమ్మెల్యేలు రాజకీయంగా ఏదైనా తప్పు చేస్తే కాపాడేందుకు ప్రయత్నిస్తాను కానీ, వ్యక్తిగతంగా తప్పు చేస్తే కాపాడలేనని ఆయన చెప్పారు. కాబట్టి జాగ్రత్తగా మసలుకోవాలని, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు.
సోమవారం విజయవాడలో..
రాష్ట్ర మంత్రులు ప్రతి సోమవారం విజయవాడలో అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మిగతా రోజుల్లో నియోజకవర్గాల్లో, హైదరాబాద్‌లోని సచివాలయంలో ఉన్నా, సోమవారం మాత్రం విజయవాడలో తప్పని సరిగా అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు.
ఇలాఉండగా కొత్త ఏడాదిలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. జన్మభూమి కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువ కావాలని ఆయన ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సూచించారు. గతంలోనూ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతంగా నిర్వహించామని అన్నారు. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని, పైగా పార్టీ కూడా ప్రజలకు దగ్గర కావడానికి ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. జన్మభూమి నిర్వహణపై తనకు ఎప్పటికప్పుడు నివేదిక వస్తుంటుందని అన్నారు.