రాష్ట్రీయం

రోడ్డుకెక్కిన కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఘర్షణ
దానం, మల్లేష్ అనుచరుల కొట్లాట

హైదరాబాద్, డిసెంబర్ 28: రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కాంగ్రెస్ నేతల గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరు వీధినపడ్డాయి. సోమవారం ఉప్పల్ బస్టాండ్ వద్ద జరిగిన పార్టీ జెండావిష్కరణ విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మాజీ మంత్రి, జిహెచ్‌ఎంసి అధ్యక్షులు దానం నాగేందర్, రంగారెడ్డి డిసిసి అధ్యక్షులు సి మల్లేష్ వర్గాల మధ్య జరిగిన ఘర్షణతో సీనియర్ కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకున్నారు. ఒకవైపు తెరాస హైదరాబాద్‌లో చాపకింద నీరులా విస్తరించి బలాన్ని పెంచుకుంటున్న నేపథ్యంలో, దానం, మల్లేష్ మధ్య తగాదా ఢిల్లీదాకా వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే, సోమవారం కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉప్పల్ బస్టాండ్‌వద్ద తాము ఎగరవేసిన జెండావద్దనే మరోసారి ఎలా ఎగరవేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దానం నాగేందర్ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. జిల్లాతో సంబంధం లేని నీవు ఇక్కడికి ఎందుకొచ్చావంటూ ఉప్పల్ నియోజకవర్గం ఇన్‌చార్జి బండారు లక్ష్మారెడ్డి, ఎల్‌బినగర్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ హైదరాబాద్‌లో ఉండాల్సిన నీవు రంగారెడ్డి జిల్లా ఉప్పల్‌కు ఎందుకు వచ్చావని, రావడానికి నీకు ఏమి అధికారం ఉందని నాగేందర్‌ను నిలదీశారు. తక్షణమే ఇక్కడి నుండి వెళ్లిపోమని హెచ్చరించారు. ఇదే సమయంలో ఇరువర్గాల నేతల అనుచరులు రెచ్చిపోయి కర్రలతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఘటనలో నాగేందర్ అనుచరులకు తలకు బలమైన గాయాలయ్యాయి. కాంగ్రెస్ 131వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాలను ఎగరవేయాలని రాష్ట్ర చీఫ్ ఉత్తమ కుమార్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం ఉప్పల్ నియోజకవర్గంలో పార్టీ జెండాల ఆవిష్కరణకు ఇన్‌చార్జి బండారు లక్ష్మారెడ్డి అనుచరులు ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జెండా ఆవిష్కరణలో జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్, మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఇన్‌చార్జి బండారు లక్ష్మారెడ్డి అనుచరులతో పాల్గొని వెళ్లిపోయారు. కొద్ది సేపట్లోనే మరో వర్గం హైదరాబాద్ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ అనుచరులతో ర్యాలీగా తరలి వచ్చారు. బాణ సంచా పేలుస్తూ ఉప్పల్ రింగ్‌రోడ్డు నుండి ట్రాఫిక్ జాం చేసుకుంటూ వచ్చిన దానం అనుచరులు ఇక్కడ ముందుగా ఎగరవేసిన జెండాను మరోసారి ఎగరవేశారు. ఈ తోపులాటలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలు కిందపడిపోయాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి శాంతి భద్రతలు అదుపు తప్పకుండా నియంత్రించారు.
** దానం, మల్లేష్ వర్గాల మధ్య ఘర్షణ దృశ్యం **