రాష్ట్రీయం

అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
హైదరాబాద్, నవంబర్ 21: రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి చర్చించేందుకు గాను శాసనసభ శీతాకాల సమావేశాలు 10 నుంచి 15 రోజులకు తగ్గకుండా నిర్వహించాలని తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కోరారు. సంప్రదాయంగా నిర్వహించాల్సిన శీతాకాల సమావేశాల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ప్రకటించలేదని ఆయన అన్నారు. బడ్జెట్ సమావేశాలతోనే శీతాకాల అసెంబ్లీ సమావేశాలను సర్దుబాటు చేయాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుందని., ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనదని అన్నారు. ఈ మేరకు శుక్రవారం వీరభద్రం ఒక ప్రకటన విడుదల చేశారు. రైతుల సమస్యలు, పంటలకు మద్దతు ధరలు, కరువు మండలాల గుర్తింపు, ప్రాజెక్టులపై ఏకపక్ష నిర్ణయాలు వంటి అంశాలపై చర్చించేందుకు అవసరమైన సమయం శీతాకాల సమావేశాల్లో కల్పించాలని కోరారు. ఇప్పటికే మిగిలిన రాష్ట్రాలు శీతాకాల సమవేశాల షెడ్యూల్‌ను ప్రకటించాయని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రకటించలేదని అన్నారు. కనీసం 10 నుంచి 15 రోజులకు తగ్గకుండా వెంటనే జరపాలని ఆయన సిఎంను కోరారు.