క్రైమ్/లీగల్

దొంగల స్వైర విహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూలై 1: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దోపిడీ దొంగల ముఠా స్వైర విహారం చేసింది. బంగారు ఆభరణాల దుకాణాలను లక్ష్యంగా చేసుకుని ఎంతో చాకచక్యంగా చోరీలకు పాల్పడి భారీ సొత్తును అపహరించుకుని పారిపోయారు. సుమారు 50లక్షల రూపాయల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును తస్కరించినట్టు భావిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున వినాయక్‌నగర్, హౌసింగ్‌బోర్డు ప్రాంతాల్లోని మూడు బంగారు దుకాణాల్లో వరుస చోరీలు జరగడం వ్యాపారవర్గాలతో పాటు స్థానిక ప్రజల్లోనూ తీవ్ర కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మహారాష్టక్రు చెందిన నెంబర్ ప్లేట్‌తో కూడిన టాటాసుమో వాహనంలో సుమారు ఐదుగురు సభ్యులు గల దొంగల ముఠా సోమవారం తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో వినాయక్‌నగర్ హౌసింగ్‌బోర్డు కాలనీకి చేరుకున్నారు. ముందుగా అక్కడి సాయితేజ జ్యూయలరీ షాప్ షట్టర్ తాళాలను ధ్వంసం చేసి లోనికి ప్రవేశించిన దుండగులు, సీ.సీ కెమెరాల వైర్లు కత్తిరించారు. దుకాణం కౌంటర్‌ను జల్లెడ పట్టిన దొంగలకు ఇక్కడ కొంతవరకు నగదు మినహా ఎలాంటి బంగారు, వెండి ఆభరణాలు లభించలేదు. అక్కడి నుండి దొంగలు వినాయక్‌నగర్‌లో బాంబే బేకరీ పక్కన గల శ్రీసాయి జ్యూయలరీ షాప్ వద్దకు చేరుకున్నారు. దుకాణం బయట ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, షట్టర్లు పైకి ఎత్తి లోనికి ప్రవేశించారు. ఈ దృశ్యాలన్నీ జ్యువలరీ షాప్‌నకు ఎదుట గల మరో దుకాణానికి చెందిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో శ్రీసాయి జ్యూయలరీ షాప్‌లో చోరీ చేసినట్టు ఫుటేజీల ఆధారంగా నిర్ధారణ అయ్యింది. ఈ షాపులో సుమారు 20 తులాల వరకు బంగారు ఆభరణాలు, 20 తులాల వెండిని అపహరించారు. అనంతరం ప్రశాంతి అపార్ట్‌మెంట్‌కు చేరువలో గల చరణ్‌తేజ బంగారు దుకాణం వద్దకు చేరుకుని ఎంతో లాఘవంగా షట్టర్లను ధ్వంసం చేసి లోనికి చొరబడిన దుండగులు, లాకర్‌లో భద్రపర్చిన 15 నుండి 20 తులాల బంగారు ఆభరణాలు, మరికొంత వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. చోరీలకు పాల్పడుతున్న క్రమంలో దొంగలకు గాయాలైనట్టు సంఘటనా స్థలాల్లో పడిఉన్న రక్తపు మరకలను బట్టి స్పష్టమైంది. దుండగులు తన ఆనవాళ్లు తెలియకుండా ముఖాలకు ముసుగులు ధరించి, చెడ్డీలపై ఉన్న దృశ్యాలు సీ.సీ కెమెరాలలో నిక్షిప్తమయ్యాయి. పక్కాగా రెక్కీ నిర్వహించిన మీదటే పథకం ప్రకారం ఈ చోరీలకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేవలం గంటన్నర వ్యవధిలోనే మూడు బంగారు దుకాణాల్లో చోరీలకు పాల్పడి భారీ ఎత్తున సొత్తును అపహరించిన దొంగలు, గుట్టుచప్పుడు కాకుండా తాము వచ్చిన టాటాసుమో వాహనంలోనే తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలోనే వారు ప్రయాణిస్తున్న వాహనం మొరాయించడంతో నవీపేట మండలంలోని అభంగపట్నం వద్ద సుమోను రోడ్డు పక్కన వదిలేసి, అదే గ్రామంలో ఇళ్ల బయట నిలిపి ఉంచిన రెండు ద్విచక్ర వాహనాలను అపహరించుకుని వాటిపై దొంగలు మహారాష్ట్ర వైపుగా పారిపోయారు. దీనిని బట్టి బంగారు దుకాణాల్లో చోరీకి పాల్పడినది మహారాష్టక్రు చెందిన చెడ్డీ గ్యాంగ్ ముఠా అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు నగర సీఐ నరేష్, నాల్గవ టౌన్ ఎస్‌ఐ లక్ష్మయ్య సంఘటనా స్థలానికి చేరుకుని చోరీలు జరిగిన తీరును పరిశీలించారు. నిందితుల ఆచూకీ కోసం క్లూస్ టీంను రప్పించి ఆధారాల కోసం అనే్వషించారు. అభంగపట్నం వద్ద దొంగలు వదిలేసి వెళ్లిన టాటాసుమోను నవీపేట పోలీసులు స్వాధీనం చేసుకోగా, ఆ వాహనంలో సైతం రక్తపు మరకలు పడి ఉండడాన్ని పోలీసులు గమనించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపారు.