క్రైమ్/లీగల్

మృతదేహంతో సిటీ అంతా తిరిగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ చానల్ చైర్మన్, పారిశ్రామిక వేత్త చిగురిపాటి జయరాం హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డి ఇంటరాగేషన్‌లో చెబుతున్న విషయాలు పోలీస్ శాఖలో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. జయరాం హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. జయరాంను హత్య చేసిన తర్వాత ఏసీపీతో 29 సార్లు, సీఐతో 14 సార్లు మొబైల్ ఫోన్లో మాట్లాడానని దర్యాప్తు అధికారులకు తెలిపాడు. బుధవారం కస్టడీకి తీసుకున్న పోలీసులు రాకేష్‌రెడ్డితో పాటు అతడికి సహకరించిన శ్రీనివాస్‌ను విచారించారు. ఈ కేసులో ఇప్పటికే ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిని విధుల నుంచి తప్పించి వీఆర్‌కు పంపారు. దర్యాప్తులో నల్లకుంట సీఐ శ్రీనివాస్ పేరు బయటకు వచ్చింది. జయరాం హత్య కేసులో రాజకీయ నేతల ప్రమేయం ఉందన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. రాకేష్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్న అంశాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థికి మద్దతుగా రాకేష్‌రెడ్డి ఎన్నికల ప్రచారం చేశాడు. ఈ కార్యక్రమాలపై పోలీసులు సమాచారం తెప్పించుకుంటున్నారు. జయరాం హత్య తర్వాత కారులో శవాన్ని ఉంచుకుని హైదరాబాద్‌లో చక్కర్లు కొట్టానని కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి ముందు రాకేష్‌రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. నల్లకుంట పోలీస్ స్టేషన్ ఎదుట సుమారు 40 నిమిషాలు శవాన్ని కారులోనే వేసుకుని వేచి ఉన్నట్టు అతడు వెల్లడించాడు. జయరాం హత్య తర్వాత ఏసీపీ మల్లారెడ్డితో పాటు నల్లకుంట సీఐ శ్రీనివాసులతో మాట్లాడానని రాకేష్‌రెడ్డి చెప్పడం కేసులో కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. హత్య విషయం తెల్సిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోకుండా కేసు నుంచి తప్పించడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగానే పరిగణిస్తున్నారు. పైగా హంతకుడికి సలహాలు, సూచనలు ఇవ్వడం ఏమిటని పోలీసు వర్గాలు బహిరంగంగా విమర్శిస్తున్నాయి. అసాంఘక శక్తులతో పోలీసులు స్నేహం చేయడం చూస్తే ఇక నేరస్థలపై ఎలాంటి కేసులు ఉండబోవన్న సంకేతాలు వచ్చినట్లేనని మండిపడుతున్నారు. జయరాంను కావాలని హత్య చేయలేదని, అప్పు తీర్చలేదన్న కోపంతో అతనిపై పిడిగుద్దులు గుద్దానని రాకేష్‌రెడ్డి తెలిపాడు. 2018లో రూ. 4.50 కోట్ల రూపాయలు జయరాం అప్పుతీసుకున్నారని పోలీస్ విచారణలో చెప్పారు. కాగా ఇప్పటి వరకు జయరాం కేసులో 30 మందిని విచారించారు. శిఖాచౌదరికి సమన్లు జారీ చేశారు. శిఖాకి సంబంధించిన బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు. మరో రెండు రోజులు పోలీస్ కష్టడీలో రాకేష్‌రెడ్డిని విచారించనున్నారు.

చిత్రం.. జయరాం హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి