క్రైమ్/లీగల్

బాలుడి కిడ్నాప్‌నకు యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జనవరి 13: బాలుడి కిడ్నాప్‌కు యత్నించిన సంఘటన ధారూరు మండల పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ధారూరు మండలం రాళ్లచిట్టంపల్లి గ్రామానికి చెందిన హుస్మాన్ అనే ఎనిమిదేళ్ల బాలుడిని ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. విషయం గమనించిన గ్రామస్థులు అడ్డుకొని దుండగులను వెంబడించి దేహశుద్ధి చేశారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించి నిందితులను పోలీసులకు అప్పగించారు. పూడూరు మండలం చన్‌గొముల్ గ్రామానికి చెందిన ఖుద్దూస్, షబ్బీర్ అని పోలీసుల దర్యాప్తులో తేలింది.
జూట్ పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి
ఖైరతాబాద్, జనవరి 13: పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం నెలకొల్పిన జూట్ పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని ధరిత్రి జూట్ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ విజ్ఞప్తి చేసింది. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షురాలు జయ సరిత మాట్లాడారు. నానాటికీ పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగం వల్ల భూమిపై జీవరాసుల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని అన్నారు. తమ అసోసియేషన్ ద్వారా జూట్ వాడకంతో పర్యావరణానికి జరిగే ప్రయోజనాన్ని ప్రజలకు వివరించడంతో పాటు ఈ రంగంపై ఆసక్తిగల మహిళలకు అవగాహన కల్పించి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో మాధవి వెంకట్, శ్రీలత, లక్ష్మి, చంద్రిక పాల్గొన్నారు.