క్రైమ్/లీగల్

‘జేఎన్‌యూ’పై దర్యాప్తు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 13: దేశ రాజధాని ఢిల్లీలోని జనహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) క్యాంపస్‌లో ఈనెల 5న చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలకు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఢిల్లీ నేర విభాగం పోలీసుల బృందం సోమవారం జేఎన్‌యూ క్యాంపస్‌ను సందర్శించింది. జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషీ ఘోష్‌తోపాటు ముగ్గురు విద్యార్థులను పోలీసులు ప్రశ్నించారు. పంకజ్ మిశ్రా, విస్కర్ విజయ్, ఘోష్‌ను విచారించినట్టు క్రైం బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. క్యాంపస్‌లో జరిగిన దాడికి సంబంధించి 9 మందిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ తొమ్మిది మందిలో పంకజ్, విస్కర్, ఘోష్ ఉన్నారు. జనవరి 5న జరిగిన దాడిలో 35 మంది విద్యార్థులు గాయపడ్డారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషీ ఘోష్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. క్యాంపస్‌లో జనవరి 1న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభకావడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. దానికి కొనసాగింపుగానే 5న దాడి ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దాడికి సంబంధించి అనుమానితలు ఫొటోలను పోలీసులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అనుమానితుల్లో విద్యార్థి యూనియన్ అధ్యక్షురాలు ఉండడం కలకలం రేపింది. తొమ్మిది మందిలో ఏడుగురు వామపక్ష విద్యార్థి సంఘాలు, ఇద్దరు ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధం ఏబీవీవీ విద్యార్థులున్నట్టు ఆరోపణలున్నాయి. లెఫ్ట్ విద్యార్థి సంఘాలకు చెందిన ఘోష్, మిశ్రా, మెక్, డోలన్ సమంతా, ప్రియా రంజన్, సుచేత తాలుక్‌దర్, ఛున్‌ఛున్ కుమార్ ఉన్నారు. అలాగే ఏబీవీపీకి చెందిన వికాస్ పటేల్, యోగేంద్ర భరద్వాజ్ అనుమానితుల జాబితాలో ఉన్నారు. మొత్తం తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్షత్ అవస్థీ, రోహిత్ షా అనే ఇద్దరు టీవీ వార్తల కోసం స్టింగ్ ఆపరేషన్ నిర్వహించినట్టు పోలీసులు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా వారికి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. అలాగే సోషల్ మీడియాలో వీడియోలో కనిపించిన ‘ముసుగు’ వ్యక్తిని పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. ఆ వ్యక్తిని కోమల్ శర్మగా అనుమానిస్తున్నారు. కోమల్ శర్మ చారల షర్డు ధరిం చి, లేత నీలం స్కార్ఫ్ కట్టుకుని ఓ కర్ర చేతితో పట్టుకుని దాడి లో పాల్గొంది. కోమల్ శర్మ దౌలత్‌రాం కాలేజీ విద్యార్థినిగా పోలీసులు గుర్తించారు. ఆమెకూ నోటీసులు జారీ చేశారు. దర్యాప్తునకు సహకరించాల్సిందిగా కోమల్ శర్మను పోలీసులు ఆదేశించారు. అయితే శనివారం రాత్రి నుంచి ఆమె మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది.
ఢిల్లీ చీఫ్‌ను ప్రశ్నించిన పార్లమెంటరీ కమిటీ
విద్యార్థి ఉద్యమాలపై పోలీసుల కఠినవైఖరిని ప్రదర్శించడంపై పార్లమెంటరీ స్థారుూ సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఢిల్లీ పోలీసు చీఫ్‌ను కమిటీ సోమవారం ప్రశ్నించింది. విద్యార్థుల పట్ల సామరస్యపూరితంగా వ్యవహరించాలని కమిటీ సూచించింది. దేశ రాజధాని ఢిల్లీలో తరచూ పోలీసులు ఆంక్షలు విధించడం వల్ల పౌరులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ సారధ్యంలోని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఎదుట ఢిల్లీ పోలీసు చీఫ్ అమూల్య పట్నాయక్ హాజరయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ కమిటీకి సారధ్యం వహిస్తున్నారు. ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లో నేరాలపై కమిటీ ఆరా తీసింది. జేఎన్‌యూ, జామియా మిలియా ఇస్లామియాలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలపై కమిటీ ప్రశ్నించినట్టు తెలిసింది. విద్యార్థి ఉద్యమాల అణచివేత అలాగే తరచూ 144వ సెక్షన్ విధిస్తున్నారని, దాని వల్ల సామాన్య పౌరులు అనేక ఇబ్బందులు పడుతున్నారని కమిటీ అభిప్రాయపడింది.
పోలీసులపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి పట్నాయక్ నుంచి సమాచారం కోరినట్టు తెలిసింది. ఢిల్లీ పోలీసు కమిషనర్‌తోపాటు హర్యానా డీజీపీ మనోజ్ యాదవ్, యూపీ, రాజస్థాన్ సీనియర్ పోలీసు అధికారులు పార్లమెంటరీ కమిటీని కలిశారు. ఎన్‌సీఆర్ పరిధిలో హింసపై కమిటీకి వివరణ ఇచ్చారు.