క్రైమ్/లీగల్

బాలికపై.. సామూహిక అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమీన్‌పూర్, జనవరి 23: ఇంటినుండి బయటకు వెళ్లిన ఒక బాలికపై గుర్తు తెలియని ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన సంఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాతపట్నం మండలం బొడ్డు మర్రి గోపాలపురం గ్రామానికి చెందిన రాజారావు బతుకుదెరువు నిమిత్తం గత రెండు సంవత్సరాల క్రితం అమీన్‌పూర్ మండలానికి వలస వచ్చాడు. స్థానికంగా వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తూ జీవనం వెల్లదీస్తున్నాడు. కాగా అతని కూతురు (16) 9వ తరగతి చదువుతోంది. గురువారం ఉదయం ఇంటినుండి కిరాణా షాపునకు వెళ్లిన బాలికను గుర్తుతెలియని ముగ్గురు యువకులు బలవంతంగా కారులో ఎక్కించుకొని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.