క్రైమ్/లీగల్

జేకే గ్రామీణ బ్యాంకులో సీబీఐ తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ గ్రామీణ బ్యాంకులో సీబీఐ బుధవారం తనిఖీలు నిర్వహించింది. ఈ బ్యాంకు కుప్వారా శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి 1.33 కోట్ల రూపాయల మేర నిధులను దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు రావడంతో సీబీఐ రంగంలోకి దిగింది. బ్యాంక్‌తోపాటు ఇక్కడ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న షారీఫ్ హుసేన్ ఖాన్ నివాసంలోనూ సీబీఐ సోదాలు జరిపింది. అతని ద్వారానే భారీ మొత్తంలో నిధులు దుర్వినియోగం అయినట్టు పోలీసులకు ఫిర్యాదు అందినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. 2016 జనవరిలో కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు దానిని సీబీఐకి అప్పజెప్పినట్టు వెల్లడించారు. విచారణలో వెలుగుచూసిన అంశాలు, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని వారు ప్రకటించారు.