క్రైమ్/లీగల్

మనీలాండలింగ్ కేసులో సీసీ థంపీకి బెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 29: ప్రవాస భారతీయుడైన వ్యాపారవేత్త సీసీ థంపీకి ఢిల్లీ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. విదేశాల్లో రాబర్ట్ వాద్రాకు చెందిన ఆస్తుల కొనుగోలు అంశంలో మనీలాండలింగ్ వ్యవహారంలో థంపీకి ప్రత్యేక జడ్జి అర్‌వింద్ కుమార్ బెయిల్ మంజూరు చేశారు.
ఐదు లక్షల వ్యక్తిగత బాండ్‌తో పాటు ఇదే మొత్తంతో ఇద్దరి నుంచి వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసినట్లు జడ్జి వివరించారు. లండన్‌లోని బ్రియాన్‌స్టన్ స్క్వేర్‌లో 1.9 మిలియన్ పౌండ్ల విలువైన ఆస్తి వాద్రా కొనుగోలు చేసిన అంశంలో మనీలాండరింగ్ జరిగినట్లు అభియోగం నమోదైంది. ఈ కేసులోనే ఈడీ థంపీని అరెస్టు చేసింది. దుబాయ్‌కి చెందిన స్కైలైట్ కంపెనీ థంపీ ఆధ్వర్యంలో నడుస్తోంది. సంజయ్ భండారికి చెందిన మరో ఆస్తి కొనుగోలు కూడా మనీలాండరింగ్ కేసును థంపీ ఎదుర్కొన్నారు.