క్రైమ్/లీగల్

సిద్దిపేట, సిరిసిల్ల కలెక్టర్లకు జరిమాన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోర్టు ధిక్కార కేసులో బుధవారం నాడు తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ అధికారులకు జైలు శిక్ష, జరిమానా విధించింది. 2018లో మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో రైతుల అభ్యంతరాలను వినకుండానే అధికారులు డిక్లరేషన్లు, అవార్డు ఇచ్చారని బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను రైతులకు తెలపాలని, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని విచారణ జరిపిన తర్వాత ఆర్డర్‌ను రైతులకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అయితే 2019 మేలో హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకోకుండానే అధికారులు డిక్లరేషన్, అవార్డును ప్రకటించారని రైతులు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం నాడు ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. అప్పటి సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్‌కు రెండు వేల రూపాయిలు చొప్పున జరిమానా విధించింది. ఒకవేళ నాలుగు వారాల్లో జరిమానా చెల్లించకపోతే నెల రోజులు జైలు శిక్ష పడుతుందని కోర్టు హెచ్చరించింది. అదేవిధంగా సిద్దిపేట ఆర్డీవో జయచందర్‌రెడ్డికి రెండు నెలల జైలు శిక్షతోపాటు రెండు వేల రూపాయిల జరిమానా కూడా హైకోర్టు విధించింది. దీంతోపాటు 12 మంది పిటిషనర్లకు రెండు వేల రూపాయల చొప్పున అధికారులు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. 2019 మే నెలలో వేసిన డిక్లరేషన్, అవార్డును కూడా హైకోర్టు రద్దు చేసింది. 2017లో ప్రకటించిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను కూడా కోర్టు రద్దు చేసింది. ప్రస్తుతం భూములు ఇవ్వని, పై కేసుల్లో పిటిషనర్లుగా ఉన్న వారికి సంబంధించిన భూ సేకరణ ప్రక్రియలు అన్నీ రద్దవుతాయని మళ్లీ మొదటి నుండి ప్రక్రియను మొదలుపెట్టాల్సి ఉంటుందని పిటిషనర్ల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఇందుకోసం నూతన ప్రాథమిక ప్రకటన ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. శిక్షలు ఎదుర్కొన్న ముగ్గురు అధికారుల సర్వీసు రికార్డుల్లో కోర్టు ధిక్కార విషయాలను పొందుపరచాలని కూడా హైకోర్టు ఆదేశించింది. 14 మంది మాత్రమే రైతులు మిగిలారని, వారు ఏమీ చెయ్యలేరనే భావనతో అధికారులు వ్యవహరించారని, న్యాయస్థానం మాత్రం రైతుల పక్షాన నిలిచి న్యాయం చేసిందని న్యాయవాది పేర్కొన్నారు.