క్రైమ్/లీగల్

గంజాయి ముఠా సభ్యుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్, జనవరి 29: విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి రాజస్థాన్‌కు గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 14 లక్షల రూపాయల విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకున్న సంఘటన రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరధిలో జరిగింది. బుధవారం నేరేడ్‌మెట్‌లోని సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. విశాఖ అరకు, రాజస్థాన్ ప్రాంతానికి చెందిన కళ్యాణ్(21), కలు బాలాయి(25), శరత్ కుమార్ (23), భక్తరాం(24)లు ముఠాగా ఏర్పడి విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని కారులో రాజస్థాన్‌కు సరఫరా చేస్తున్నట్టు సీపీ తెలిపారు. గంజాయి అక్కడ రూ.2 వేల కొనుగోలు చేసి బయట మార్కెటులో రూ.10 వేల వరకు విక్రయిస్తున్నట్టు సీపీ తెలిపారు.