క్రైమ్/లీగల్

ముగ్గురికి ఉరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జనవరి 30: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన సమత హత్యాచార కేసులో నిందితులకు ఉరి శిక్ష విధిస్తూ ఆదిలాబాద్ ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది. సమతపై సామూహిక అత్యాచారం చేయడంతో పాటు కిరాతకంగా హతమార్చిన ఘటనపై సర్వత్రా అందోళనలు రేకెత్తిన విషయం విదితమే. ఈ కేసుపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో ఇరుపక్షాల వాదనల అనంతరం ముగ్గురు నిందితులు క్షమించరాని నేరం చేసినందున ఐపీసీ సెక్షన్ 302, 376, 404, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల కింద దోషులకు ఉరి శిక్ష విధిస్తున్నట్ట్లు న్యాయమూర్తి గురువారం సంచలనాత్మక తీర్పునిచ్చారు. తీర్పు ప్రకటించగానే నిందితులు భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. ఈ కేసు విచారణ కేవలం 45 రోజుల్లోనే ముగించి న్యాయస్థానం తుది తీర్పునివ్వడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయ. ఆసిఫాబాద్ కుమ్రంభీం జిల్లా లింగాపూర్ మండ లం ఎల్లాపటార్ గ్రామ శివారులో నవంబర్ 24న షేక్ బాబు, షాబొద్దిన్, మఖ్దూమ్ అనే ముగ్గురు యువకులు దారికాచి అటువైపు వెళ్తున్న సమతను వెంటాడి చెట్ల పొదల మధ్య పాశవికంగా అత్యాచారానికి ఒడిగట్టడమే గాక కిరాతకంగా హతమార్చిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని, పేద మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అందోళనలు వెల్లువెత్తాయి. ఖానాపూర్ మండలం గోసంపల్లికి చెందిన సమత స్టీల్ గినె్నలు, బెలూన్లను విక్రయిస్తూ సంచార జీవనం గడుపుతున్న క్రమంలోనే ఎల్లాపటార్ ప్రాంతంలో ఈ దళిత మహిళ కామాంధుల చేతిలో బలైంది. జరిగిన ఘటనపై బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు సీరియస్‌గా స్పందించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ మల్లారెడ్డి ఈ ఘటనలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి ఘటన జరిగిన మూడు రోజులకే నిందితులను అరెస్ట్ చేశారు. దిశ ఘటన తరహాలోనే ప్రజా అందోళనలు ఉద్ధృతం కాగా ప్రభుత్వం సమత కేసు విచారణకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తున్నట్టు డిసెంబర్ 11న ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 14న ఆదిలాబాద్‌లో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు కాగా ఈ కేసులో పోలీసులు 45 మంది సాక్షుల అభియోగాలతో కూడిన 90 పేజీల చార్జిషీట్‌ను ప్రత్యేక కోర్టుకు సమర్పించారు. కేసు విచారణ సందర్భంగా పోలీసులు సకాలంలో స్పందించి హత్యాచార ఘటనకు సంబంధించి డీఎన్‌ఏ ఫోరెన్సిక్ శాస్ర్తియ, సాంకేతిక ఆధారాలను నివేదించగా డిసెంబర్ 16 నుండి 23 వరకు ఐదు రోజుల పాటు నిందితులను కోర్టుకు హాజరుపర్చారు. అయితే, నిందితుల తరఫున వాదించడానికి బార్ అసోసియేషన్ ముందుకు రాకపోవడంతో లీగల్‌సెల్ ఆథారిటీ ద్వారా ప్రభుత్వమే న్యాయవాది రహీంను నిందితుల తరఫున వాదించేందుకు నియమించింది. విడతల వారీగా సమత తరఫున 25 మంది సాక్షుల వాంగ్మూలాన్ని సేకరించిన న్యాయస్థానం నిందితుల
తరఫున సాక్షులను ప్రవేశపెట్టేందుకు అవకాశం కల్పించింది. అయితే, సాక్షులెవరూ ముందుకు రాకపోవడంతో జనవరిలో ఐదుసార్లు ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం చివరగా జనవరి 27న తుది తీర్పు వెల్లడిస్తామని ప్రకటించింది. అయితే, న్యాయమూర్తి అనారోగ్యంతో సెలవుపై వెళ్లడంతో తీర్పును ఈనెల 30కి వాయిదా వేయగా గురువారం కోర్టు ప్రాంగణమంతా తీర్పుపై సర్వత్రా ఉత్కంఠత, ఉద్విగ్నత నెలకొంది. న్యాయమూర్తి తీర్పు వెలువరించే ముందు పది నిమిషాల పాటు లోనికి వెళ్ళడం, ఉద్విగ్నంగా కనిపించడం గమనార్హం. తీర్పుకు ముందు నిందితులు అభిప్రాయాలు చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వగా ముగ్గురు నిందితులు షేక్ బాబా (ఏ1), షేక్ షాబొద్దిన్ (ఏ2), షేక్ మఖ్దూమ్ (ఏ3)లు న్యాయమూర్తి ఎదుట కంటతడి పెడుతూ తమకు భార్య నలుగురు పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఉన్నారని, వారిని పోషించేందుకు పెద్ద దిక్కు లేనందున క్షమించాలని వేడుకున్నారు. క్షమించరాని నేరం చేసినందున నిందితులకు సరైన శిక్షగా భావించి ఉరి శిక్ష ఖరారు చేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించడంతో ఉత్కంఠతకు తెరవీడింది. హత్యాచార ఘటనతో పాటు మృతురాలి పర్సు నుండి రూ. 200 దొంగిలించి ఆమె సెల్‌ఫోన్‌ను కూడా అపహరించినందుకు నిందితులకు రూ. 27వేల జరిమానా విధించారు. కాగా, అక్కడే న్యాయస్థానం వద్ద తీర్పుకోసం ఎదురుచూస్తున్న సమత భర్త గోపి భావోద్వేగానికి గురవుతూ కంటతడి పెడుతూనే పోలీసులు, న్యాయస్థానం తమకు సరైన తీర్పునిచ్చిందని, తన భార్య ఆత్మ శాంతించిందని పేర్కొన్నారు. సత్వర కేసు విచారణలో పాలుపంచుకున్న పోలీసులకు అక్కడే దండం పెట్టడం అందరినీ కదిలించింది. సమత సొంత గ్రామం గోసంపల్లి గ్రామస్థులు సైతం ఉరి శిక్ష తీర్పుపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. కాగా, ఉరిశిక్ష ఖరారైన నిందితులను సాయంత్రం ఎస్కార్ట్ సాయంతో చర్లపల్లి జైలుకు తరలించారు.
*చిత్రాలు.. ఏ1 షేక్ బాబు
**ఏ2 షేక్ షాబొద్దీన్
**ఏ3 షేక్ మఖ్దూమ్