క్రైమ్/లీగల్

విద్యుదాఘాతానికి రైతు కూలీ సజీవ దహనం,

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ, జనవరి 30: మండలంలోని ఐతవరంలో విద్యుదాఘాతానికి ఒక రైతు కూలీ సజీవ దహనమయ్యాడు. మరో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం గురువారం జరిగింది. సేకరించిన సమాచారం ప్రకారం గ్రామానికి చెందిన మార్కపూడి గురవయ్య, యేసయ్య, శివ ట్రాక్టర్‌పై పొలం నుండి వరిగడ్డి వేసుకుని పొలం మధ్య నుండి వస్తుండగా 11కెవి విద్యుత్ వైర్లు గడ్డికి తగిలి మంటలు లేచాయి. ఈ దుర్ఘటనలో గడ్డిపై కూర్చున్న గురవయ్య సజీవ దహనం కాగా యేసయ్య, శివ తీవ్రంగా గాయపడ్డారు. ట్రాక్టర్ ట్రక్కు సహా వరిగడ్డి పూర్తిగా దగ్ధం అయ్యింది. క్షతగాత్రులను హుటాహుటిన విజయవాడ తరలించారు. పొలాల్లో విద్యుత్ వైర్లు కిందకు వేలాడుతున్నా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.