క్రైమ్/లీగల్

బి ఫార్మశీ విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, జనవరి 30: స్థానిక సిద్దార్థ ఫార్మశీ కళాశాలలో బి ఫార్మశి చదువుతున్న విద్యార్థి గురువారం ఆత్మహత్య చేసుకుంది. ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామానికి చెందిన మందా రాజు విజయవాడలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రాజు కుమార్తె శైలు (19) స్థానిక ఫార్మశీ కళాశాలలోని వసతి గృహంలో ఉంటూ బి ఫార్మశి రెండో సంవత్సరం చదువుతోంది. గురువారం ఉదయం యధావిధిగా తరగతులకు వచ్చింది. రెండు క్లాసులు ముగిసిన అనంతరం ఆరోగ్యం బాగోలేదంటూ అనుమతి తీసుకుని హాస్టల్ గదికి వెళ్ళింది. భోజన అనంతరం సహచర విద్యార్థులు గదిలోకి వెళ్ళగా శైలు తన చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించింది. ఈ విషయాన్ని విద్యార్థులు కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళగా వెంటనే శైలును జిఎంహెచ్ వైద్యశాలకు చికిత్స కోసం తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. శైలు ఉంటున్న రూంలో సూసైడ్ నోట్ లభ్యమైంది. తన చావుకు సంబంధించి ఎటువంటి విచారణ చేయవద్దని తల్లిదండ్రులకు లేఖ రాసింది. ప్రేమ విఫలమై శైలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటుందని సహచర విద్యార్థులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ఎస్‌ఐ బి శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.