క్రైమ్/లీగల్

సీబీఐ కోర్టుకు సీనియర్ అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో శుక్రవారం నాడు మాజీ ఐఎఎస్‌లు , పారిశ్రామిక వేత్తలు సీబీఐ- ఈడీ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరయ్యారు. శుక్రవారం నాడు కోర్టు ముందు హాజరుకాకుండా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మినహాయింపు పొందారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదాయ కేసుల్లో సీబీఐ 11 చార్జిషీట్లను, ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ ఐదు చార్జిషీట్లను దాఖలుచేసింది. ఈ కేసులను ఎదుర్కొంటున్న ఎన్ శ్రీనివాసన్, అయోధ్య రామిరెడ్డి, ఇందూ శ్యాం ప్రసాద్‌రెడ్డి, విశ్రాంత అధికారులు శామ్యూల్, మన్మోహన్‌సింగ్, రాజగోపాల్, కృపానందం విచారణకు హాజరయ్యారు. నాంపల్లి సీబీఐ కోర్టులో హాజరుకు సంబంధించి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మినహాయింపు కోరగా దానిని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించడంతో జగన్మోహన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తదుపరి విచారణను రెండోవారానికి వాయిదా వేయడంతో మధ్యలో సీబీఐ కోర్టు హాజరుకు సంబంధించి స్పష్టత కోసం మరో మారు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కేసు విచారణ అంశాన్ని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దృష్టికి తీసుకురావాలని జగన్ న్యాయవాదులకు హైకోర్టు సూచించడంతో వారు సీబీఐ కోర్టు ముందు ఈ మేరకు పిటిషన్లు దాఖలు చేశారు.