క్రైమ్/లీగల్

ఉరి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నిర్భయ గ్యాంగ్‌రేప్, హత్య కేసులో నలుగురు ముద్దాయిల ఉరిశిక్ష అమలును ఢిల్లీ కోర్టు వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు వీరి ఉరిశిక్షను వాయిదా వేస్తున్నట్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి ఒకటో తేది (శనివారం) జరుపతలపెట్టిన ఉరిశిక్ష అమలును నిలిపివేయాలని కోరుతూ ఈ కేసులోని ముగ్గురు ముద్దాయిలు దాఖలు చేసిన పిటిషన్‌పై అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా ఈ ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు శుక్రవారం ఉదయం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు నిర్ణయాన్ని మధ్యా హ్నం తరువాత సెషన్‌కు వాయిదా వేసింది. ముగ్గురు ముద్దాయిలు దాఖలు చేసిన పిటిషన్‌ను సవాలు చేస్తూ తీహార్ జైలు అధికారులు సమర్పించిన సమాధానంతో కోర్టు ఏకీభవించలేదు. ముద్దాయిలు పవన్ గుప్తా, వినయ్ కుమార్ శర్మ, అక్షయ్ కుమార్, ముకేశ్ కుమార్ సింగ్‌లకు విధించిన ఉరిశిక్షను అమలు చేయడానికి ట్రయల్ కోర్టు జనవరి 17వ తేదీన బ్లాక్ వారెంట్లు జారీ చేసింది.
ఒక ముద్దాయి దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉంటే, ఆ కేసులోని మిగతా వారిని ఉరి తీయరాదని నిబంధనలు పేర్కొంటున్నాయని ముద్దాయిలు పవన్, వినయ్, అక్షయ్ తరపు న్యాయవాది ఏపీ సింగ్ కోర్టులో వాదించారు. ఉరిశిక్ష అమలును నిరవధికంగా వాయిదా వేయాలని ఆయన కోర్టును కోరారు. వినయ్ క్షమాభిక్ష పిటిషన్ రాష్టప్రతి వద్ద పెండింగ్‌లో ఉంది. ముకేశ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ జనవరి 17వ తేదీన తిరస్కరించారు. రాష్టప్రతి తన క్షమాభిక్ష దరఖాస్తును తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ముకేశ్ దాఖలు చేసిన అప్పీలును సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. మొత్తంమీద నలుగురు ముద్దాయిల ఉరిశిక్ష
అమలు ఇప్పుడు రెండోసారి వాయిదా పడింది. తొలిసారి అంతకుముందు జనవరి 22వ తేదీన వీరి ఉరిశిక్షను అమలు చేయాలని ట్రయల్ కోర్టు జనవరి ఏడో తేదీన ఆదేశాలు జారీ చేసింది. వినయ్, అక్షయ్ దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే కొట్టి వేసింది.