క్రైమ్/లీగల్

ట్రయల్ కోర్టు ఆదేశాన్ని కొట్టివేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నిర్భయ గ్యాంగ్‌రేప్, హత్య కేసులో నలుగురు ముద్దాయిలకు పడిన ఉరిశిక్ష అమలును నిరవధికంగా వాయిదా వేస్తూ ట్రయల్ కోర్టు జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీఎన్ పటేల్‌ను కోరింది. నిర్భయ కేసులో నలుగురు ముద్దాయిలకు షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి ఒకటో తేది (శనివారం) ఉరిశిక్షను అమలు చేయవలసి ఉండింది. ట్రయల్ కోర్టు నిరవధికంగా వాయిదా వేయడంతో ఇది నిలిచిపోయింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు ఉరిశిక్ష అమలును నిలిపివేయాలని ట్రయల్ కోర్టు శుక్రవారం జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ట్రయల్ కోర్టు జారీ చేసిన ఆదేశాలను కొట్టివేయాలని ఈ పిటిషన్‌లో అభ్యర్థించింది. ముద్దాయిలు ముకేశ్ కుమార్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ సింగ్‌ల తో పాటు డైరెక్టర్ జనరల్ (జైళ్లు), తీహార్ జైలు సూపరింటెండెంట్‌లను ఈ పిటిషన్‌లో కక్షిదారులుగా చేర్చింది. నలుగు రు ముద్దాయిల ఉరిశిక్షను అమలు చేయడానికి జారీ చేసిన వారంట్లను వాయిదా వేయడంలో ట్రయల్ కోర్టు జడ్జి తన పరిధికి మించి వ్యవహరించారని ఈ పిటిషన్‌లో పేర్కొన్నా రు. ట్రయల్ కోర్టు ఉరిశిక్ష అమలును నిరవధికంగా వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసే సమయంలో నలుగురు ముద్దాయిలు ఒక మహిళను గ్యాంగ్‌రేప్, హత్య చేసిన క్రూరమయిన నేరస్థులనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమయిందని కేంద్రం తన పిటిషన్‌లో పేర్కొంది. ముద్దాయిలకు వారికి ఉపశమనం కలిగించే అన్ని న్యాయపరమయిన మార్గాలను ఉపయోగించుకునేందుకు తగినంత అవకాశం ఇచ్చినప్పటికీ, వారు ఉద్దేశపూర్వకంగానే వారి పిటిషన్లను దాఖలు చేయడంలో జాప్యం చేస్తున్నారని కేంద్రం ఆరోపించింది. ముద్దాయిలు తమ ఉరిశిక్ష అమలును జాప్యం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారని వారి ప్రవర్తన స్పష్టం చేస్తోందని పేర్కొంది. ఇలా వ్యవహరించడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే కాకుండా కోర్టులను, న్యాయ వ్యవస్థను పరిహాసం చేయడమే అవుతుందని పేర్కొంది.