క్రైమ్/లీగల్

కాంట్రాక్టర్ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఫిబ్రవరి 1: తాను చేసిన పనికి డబ్బులు చెల్లించక పోవడంతో ఓ భవన నిర్మాణ కాంట్రాక్టర్ నిర్మిస్తున్న భవనంలోనే ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఎల్లమ్మబండ, కూకట్‌పల్లిలో నివాసం ఉండే కాంట్రాక్టర్ అబ్దుల్ నబీ గత నాలుగు నెలల క్రితం ఎంఎస్ మక్తా రాజ్‌నగర్‌లోని సలీమ్ ఇంటిని నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. నాలుగు అంతస్థుల భవనాన్ని నిర్మించగా పనులు తుది దశకు చేరుకున్నాయి. సలీమ్ సుమారు ఆరు లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉండగా ఆలస్యం చేస్తున్నాడు. కూలీల తమ డబ్బు చెల్లించాలని కోరుతుండటంతో సర్దిచెబుతూ వస్తున్నాడు. ఇదే క్రమంలో శనివారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన అబ్దుల్ ఎంఎస్ మక్తాకు చేరుకున్నాడు. డబ్బు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తుండటంతో మానసిక వేదనకు గురై తాను నిర్మిస్తున్న భవనంలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న భార్య హుస్సెన్ బీ సమాచారం మేరకు పంజాగుట్ట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.