క్రైమ్/లీగల్

గంజాయి కేసులో ముగ్గురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఫిబ్రవరి 1: గంజాయిని విక్రయించేందుకు యత్నించిన ముగ్గురు యువకులను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కధనం ప్రకారం.. మల్కాజ్‌గిరిలో నివాసం ఉండే ప్రమోద్‌కుమార్, కుత్బుల్లాపూర్‌లో నివాసం ఉండే జ్ఞాన ప్రసాద్, జీ.నిఖిల్ రాజ్‌లు గంజాయిని విక్రయించేందుకు అమీర్‌పేటకు చేరుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు డీఐ నాగయ్య టీమ్ అక్కడి చేరుకొని వారిని అదుపులోనికి తీసుకొని ప్రశ్నించగా పొంతనలేని మాటలు చెప్పి తప్పించుకునేందుకు యత్నించారు. పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించగా విక్రయాలు జరుపుతున్నట్టు ఒప్పుకున్నారు. దీంతో వారి వద్ద నుంచి కిలో గంజాయి, ఒక ద్విచక్రవాహనం, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పంజాగుట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.