క్రైమ్/లీగల్

పట్వారీ ఎన్‌క్లేవ్‌లో చైన్ స్మాచింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఫిబ్రవరి 1: నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోబంగారు గెలుసును తస్కరించిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని పట్వారీ ఎన్‌క్లేవ్‌లో నివాసముండే సంధ్య (32) శనివారం ఉదయం ఐడీపీఎల్‌కు వాకింగ్‌కు వెళ్లింది. తిరిగి వస్తుండగా ఎల్‌ఎస్ ఫంక్షన్ హాల్ సమీపంలో గుర్తుతెలియని ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనం పై వచ్చి సంధ్య మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.