క్రైమ్/లీగల్

కరకట్టపై కేఈబీ కెనాల్‌లోకి దూసుకెళ్ళిన కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, ఫిబ్రవరి 1: కరకట్ట మీద నుంచి అదుపుతప్పి కేఈబీ కెనాల్‌లోకి దూసుకెళ్ళి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలోని చాగంటిపాడు సమీపంలో శనివారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్ర ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్ కోసూరు శ్రీనివాసరావు భార్య రమ్య, కుమారుడు అస్రుత్‌తో కలిసి కరకట్ట మీదుగా కారులో అవనిగడ్డ ఫంక్షన్‌కు బయలుదేరాడు. కారు మండలంలోని చాగంటిపాడు సమీపంలోకి రాగానే కరకట్ట వెంబడి ఉన్న సైడ్‌వాల్స్‌కు కారు అదుపుతప్పి ఢీకొనడంతో డ్రైవర్ పక్కన ఉన్న కారు డోర్ తెరుచుకుని డాక్టర్ కోసూరు శ్రీనివాసరావు(42) కిందపడగా ఆయన పై నుంచి కారు పల్టీలు కోట్టుకుంటు కేఈబీ కెనాల్‌లోకి దూసుకు వెళ్ళింది. కారు పై నుంచి వెళ్ళటంతో శ్రీనివాసరావు తలకి తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న భార్య రమ్య రక్షించమని కేకలు పెట్టటంతో పోలంలో చెరకు నరుకుతున్న కూలీలు చూసి పరుగెత్తుకుని వచ్చి రమ్యను, కుమారుడైన అస్రుత్(3)ను కాలువలో నుంచి పైకి తీసుకువచ్చి వెంటనే ఆస్పత్రికి తరలించారు. వారు స్వల్పగాయాలతో బయట పడ్డారు. కేఈబీ కెనాల్‌లో నీరు ఎక్కువగా లేకపోవటం వల్ల ప్రమాదం తప్పింది. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ వై చిట్టిబాబు పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. శ్రీనివాసరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన జరగటంతో కరకట్ట మీద జనాలతో కిక్కిరిసి పోయింది. కొంతమేర ట్రాఫిక్‌కు అంతరాయం కల్గింది.