క్రైమ్/లీగల్

రాత్రి వేళల్లో ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్థుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 1: రాత్రి వేళల్లో ఇళ్లల్లో చోరీలకు పాల్పడే పాత నేరస్థుడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.30లక్షలు విలువైన చోరీ సొత్తు రికవరీ చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీసీపీ హర్షవర్థన్‌రాజు వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన దాసరి హరితేజ అలియాస్ తేజ (27) సుమారు ఐదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి రామవరప్పాడు మల్లెపూడి వారి వీధిలో నివాసముంటున్నాడు. గతంలో కొంతకాలం కారుడ్రైవర్‌గా పనిచేసే క్రమంలో నేరబాట పట్టాడు. నిందితుడు హరితేజపై గతంలో నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్టేషన్లలో చోరీ కేసులకు సంబంధించి కేసులు నమోదు కాగా ఆయా కేసుల్లో అరెస్టయి జైలుకు వెళ్లివచ్చాడు. తన నేరప్రవృత్తిని కొనసాగిస్తున్న క్రమంలో పటమట పోలీస్టేషన్ పరిధిలోని మాదవపెద్ది వారి వీధికి చెందిన కొర్రపోలు శ్రీనివాసరావు ఇంట్లో జనవరి 20న దొంగతనానికి పాల్పడి బీరువాలోని సేఫ్ లాకర్‌తో సహా నగదు, బంగారు నగలు, వెండి అపహరించాడు. అదేవిధంగా ఆయా కేసుల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు హరితేజను అరెస్టు చేసి సుమారు 703 గ్రాముల బంగారం, 464 గ్రాముల వెండి, రూ.2,20,700 లక్షలు నగదు, మొత్తం 30లక్షల విలువైన చోరీ సొత్తు రికవరీ చేసినట్లు డీసీపీ వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండుకు తరలిస్తున్నట్లు తెలిపారు. విలేఖరుల సమావేశంలో క్రైం డీసీపీ కోటేశ్వరరావు, సీఐ సీహెచ్‌పీ కృష్ణంరాజు, పీ వెంకటేశ్వరరావు, సీహెచ్ చలపతిరావు, సీసీఎస్ ఎస్‌ఐలు మోహన్‌కుమార్, కిషోర్, కే నాగేశ్వరరావు, పటమట ఎస్‌ఐ వీవీ సత్యనారాయణ, సీసీఎస్ సిబ్బంది డీఎన్ సురేష్, శ్రీ్ధర్, తదితరులు పాల్గొన్నారు.