క్రైమ్/లీగల్

నకిలీ సర్ట్ఫికెట్ల ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఫిబ్రవరి 1: నకిలీ సర్ట్ఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. సర్ట్ఫికెట్లు ముద్రించి విక్రయించే గ్లెన్‌బ్రిగ్స్‌తో పాటు ఐదుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఏపీ, కర్నాటక పోలీసులకు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న గ్లెన్‌బ్రిగ్స్ కేజీ నుంచి పీజీ వరకు, గల్లీ నుంచి ఇంటర్నేషనల్ వరకు ఎలాంటి సర్ట్ఫికెట్ అయినా ఇట్టే నకిలీది సృష్టించడంలో దిట్ట. ఇతని కోసం పోలీసులు చాలా కాలంగా గాలిస్తున్నారు. ముఠా వివరాలను జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు శనివారం విలేఖరులకు వెల్లడించారు. గుంతకల్లుకు చెందిన గ్లెన్‌బ్రిగ్స్ నకిలీ సర్ట్ఫికెట్ల తయారీ, విక్రయంలో దిట్ట. ఇతను పాతికేళ్లుగా ఇదే వ్యాపారం చేస్తున్నాడు. ఒక్కో సర్ట్ఫికెట్ రూ.5 వేల నుండి రూ. 25 వేల వరకు విక్రయించేవాడు. ఇతనిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 15 కేసులున్నాయి. నకిలీ సర్ట్ఫికెట్ల విక్రయంలో ఆరితేరిన బ్రిగ్స్ తన అక్రమ వ్యవహారంలో ఫ్యాక్షనిస్టులను భాగస్వామ్యం చేసుకున్నాడు. పెద్దవడుగూరు మండలానికి చెందిన వెంకటేష్ నాయుడు, రమేష్‌నాయుడు, వెంకటరమణ, తిరుపతికి చెందిన మదన్‌తో కలిసి నకిలీ సర్ట్ఫికెట్లు విక్రయించేవాడు. తిరుపతి నుంచి సర్ట్ఫికెట్లకు సంబంధించిన సామగ్రితో గుంతకల్లుకు వెళ్తుండగా పామిడి సమీపంలోని మిడుతూరు క్రాస్ వద్ద పామిడి పోలీసులు, సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారంతా పాతనేరస్తులే. ముఠా నుంచి 699 గ్రాముల బంగారం, ఇన్నోవా కారు, రూ. 1.10 లక్షల నగదు, 11 మొబైల్ ఫోన్లు, 70 నకిలీ సర్ట్ఫికెట్లు, కంప్యూటర్, హార్డ్‌వేర్ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. నకిలీ సర్ట్ఫికెట్ల ముఠాను అరెస్టుచేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.

*చిత్రం...ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న నకిలీ సర్ట్ఫికెట్లు చూపిస్తున్న అనంతపురం జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు