క్రైమ్/లీగల్

మహారాష్టలో ఘోర రోడ్డు ప్రమాదం :12 మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మహారాష్టలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక్కడికి 400 కిలోమీటర్ల దూరంలోని జలగాం జిల్లాలో ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకొంది.
రాత్రి 11 గంటలు దాటాకా బాలు నారాయణ్ చౌదరి అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొందని జలగాం పోలీసులు సోమవారం వెల్లడించారు. ఈ ఘటనలో బాలు నారాయణ చౌదరి, ఆయన భార్య సహా ఎస్‌యూవీ వాహనంలో ఉన్న పది మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
చోప్రా గ్రామంలో వివాహ కార్యక్రమంలో పాల్గొని స్వగ్రామమైన చించోల్‌కు తిరిగి వస్తుండగా చోప్రా-ఫైజ్‌పూర్ రోడ్డులో ఎదురుగా వస్తున్న డంపర్ ట్రక్కు ఢీకొనడంతో ప్రమాదం సంభవించినట్లు పోలీసులు వివరించారు. క్షతగాత్రులు ఐదుగురిని జలగాంలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. డంపర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు వివరించారు. ట్రక్కు డ్రైవర్ ముకుంద్ భాంగేల్‌ను అరెస్టు చేసి అతనిపై ఐపీసీ 304-ఏ (నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడం), సెక్షన్ 279 (అతివేగం) కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. మృతులంతా ముక్తాయ్ తాలూకా చించోల్, మెహుల్ గ్రామాలకు చెందిన వారుగా గుర్తించారు. మృతులను బాలు చౌదరి, మంగ్లా చౌదరి, అశే్లష చౌదరి, రియా చౌదరి, సొనాలి చౌదరి, ప్రియాంక చౌదరి, సొనాలి మహాజన్, సుమన్‌భాయ్ పాటిల్, సంగీత పాటిల్, శివం చౌదరి, ఎస్‌యూవీ డ్రైవర్ ధన్‌రాజ్‌లుగా గుర్తించారు. మరొకరిని గుర్తించాల్సి ఉందని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.