క్రైమ్/లీగల్

విచారణ అంశాలు ఖరారు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: శబరిమలతోపాటు వివిధ ప్రార్థనామందిరాల్లోకి మహిళల ప్రవేశంపై దాఖలైన పిటిషన్లకు సంబంధించి విచారణ అంశాలను తామే ఖరారు చేస్తామని సుప్రీం కోర్టు ప్రకటించింది. విచారణ అంశాల క్రోడీకరణకు తదుపరి విచారణను ప్రధాన న్యాయమూర్తి ఏస్‌ఏ బాబ్డే గురువారానికి వాయిదా వేశారు. దీనిపై వాదనలు వినిపించేందుకు పిటిషనర్ల తరఫున్యాయవాదులకు తామే సమయం కేటాయిస్తామని తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. మత విశ్వాసాలు, వాటిలో జోక్యం చేసుకునే విషయంలో న్యాయపరిధిపై మాత్రమే విచారణ పరిధిని సుప్రీం కోర్టు ఖారారు చేయనుంది. ఏఏ అంశాలపై వాదనలు వినిపించాలో గురువారం నాటికి తాము రూపొందిస్తానని బెంచ్ తెలిపింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై గత ఏడాది నవంబర్ 14న ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం వెలువరించిన తీర్పును బాబ్డే ఈ సందర్భంగా ప్రస్తావించారు. 3:2 మెజారిటీతో ఈ అంశాన్ని విస్తృత బెంచ్‌కు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రార్థనాలయాల్లోకి మహిళల ప్రవేశం మతస్వేచ్ఛకు సంబంధించిన వాటిపై న్యాయపరమైన నిర్ణయం అవసరం అని కోర్టు అభిప్రాయపడింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై 2018న సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టాలన్న నిర్ణయాన్ని సీనియర్ న్యాయవాదులు ఎఫ్‌ఎస్ నారిమన్, కపిల్ సిబల్, రాజీవ్ ధావన్, రాకేష్ ద్వివేది, శ్యామ్ దివాన్ తప్పుపట్టారు. అయితే మత విశ్వాసాలకు సంబంధించిన అంశాల్లో న్యాయపరిధిపై మాత్రమే విచారించాలని న్యాయమూర్తులు, ఆర్ బానుమతి, అశోక్ భూష ణ్, ఎల్ నాగేశ్వరరావు, ఎంఎం శాంతానగౌడ్‌డర్, ఎస్‌ఏ నజీర్, ఆర్ సుభాష్‌రెడ్డి, బీఆర్ గవాయి, సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.