క్రైమ్/లీగల్

బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురికి యావజ్జీవ ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జగదేవ్‌పూర్: బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురికి యావజ్జీవ శిక్ష విధించడంతో పాటు రూ. 10వేల వంతున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. గజ్వేల్ ఏసీపీ నారాయణ సోమవారం ప్రజ్ఞాపూర్‌లోని ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంఘటనకు సంబందించి వివరాలు అందించారు. జగదేవ్‌పూర్ మండలం రాయవరం గ్రామానికి చెందిన 16 ఏళ్ళ బాలికను మే 15వ తేదీ 2019న శివరాత్రి వెంకట్ (ఐనాపూర్), శివరాత్రి అంజనేయులు (బోదన్ టౌన్), మానకొండ శ్రీరాం (పెద్ద ఆరెపల్లి)లు మాయమాటలు చెప్పి మోటారు బైకుపై తిమ్మాపూర్ శివారులోని గోపాల్‌పూర్ టీజంక్షన్ చింతచెట్టు వద్దకు తీసుకెళ్లి సామూహికంగా పలుమార్లు మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అలాగే ఆమె బంగారు చెవి కమ్మలు లాక్కొని వెళ్లగా, బాధితురాలు మే 16వ తేదీన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. జగదేవ్‌పూర్ ఎస్‌ఐ సాయిరాం కేసు నమోదు చేసుకొని ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయగా, ఏసీపీ నారాయణ నేతృత్వంలో దర్యాప్తు చేపట్టి 4 రోజుల లోనే నిందితులను గుర్తించడంతో పాటు 19వ తేదీన అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. పోలీస్ కమిషనర్ జోయల్‌డెవిస్ ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించి టెక్నికల్ క్వాలిటీ ఇనె్వస్టిగేషన్ చేపట్టేలా చర్యలు తీసుకోగా, 23 మంది ప్రత్యక్ష, పరోక్ష సాక్షులను విచారించడంతో పాటు స్వహస్తాలతో స్టేట్‌మెంట్‌లు రికార్డు చేయించారు. అలాగే సాంకేతిక ఆదారాల కోసం అమ్మాయికి, నేరస్తులకు సంబందించిన వస్తువులను సేకరించి హైదరాబాద్ లోని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించగా, వచ్చిన రిపోర్ట్ ఆదారంగా 65 రోజుల్లోనే కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. దీంతో సంగారెడ్డి అడిషనల్ డిస్ట్రిక్ట్ సేషన్ కోర్టు జడ్జి పాపిరెడ్డి ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం నిందితులు నేరం చేశారని రుజువు కావడంతో న్యాయమూర్తి తీర్పు వెలువరించినట్లు ఏసీపీ నారాయణ స్పష్టం చేశారు.
ఈ కేసులో ఏపీఓ శ్రీనివాస్ రెడ్డి వాదించగా, సహకరించిన సీఐ శివలింగం, ఎస్‌ఐ సాయిరాం, కోర్డు లైజనింగ్ సత్యనారాయణ, కానిస్టేబుల్ పరశరాములును పోలీస్ కమిషనర్ జోయల్‌డెవిస్ అభినందించగా, త్వరలోనే రివార్డులు అందించనున్నట్లు ఏసీపీ నారాయణ వివరించారు.