క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన లైన్ ఇన్‌స్పెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల అవినీతిపై ప్రజలు ఎంత తీవ్రమైన ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నా, అవినీతికి ఏ మాత్రం అడ్డుకట పడటం లేదు. కొద్దిరోజుల క్రితం ఏకంగా మిలిటరీ మేజర్‌నే లంచం అడిగిన జీహెచ్‌ఎంసీ ట్యాక్సు ఇన్‌స్పెక్టర్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోగా, ఇపుడు కంటోనె్మంట్‌లోని ఎలక్ట్రిక్ విభాగంలో లైన్‌మెన్‌గా పనిచేస్తున్న ఉద్యోగి రూ.4వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ అధికారి అచ్చేశ్వరరావు ఘటన వివరాలను వెల్లడించారు. మారెడ్‌పల్లి కరెంటు ఆఫీసులో కాంట్రాక్టరుగా పనిచేస్తున్న మహేశ్ తన ఇంటికి త్రీ ఫేజ్ కరెంటు కనెక్షన్ మంజూరీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కనెక్షన్ ఇచ్చేందుకు సదరు లైన్‌మెన్ సురేశ్ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినట్లు తెలిపారు.
మూడు సంవత్సరాలుగా కనెక్షన్ ఇవ్వకుండా ఆఫీసు చుట్టూ తిప్పుకోవటం, చివరకు లంచం ఇస్తేనే కరెంటు కనెక్షన్ ఇస్తానని ఆయన తేల్చి చెప్పటంతో బాధితుడు మహేశ్ అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించానని మహేశ్ తెలిపాడు. ఈ మేరకు లైన్‌మెన్‌పై ఏసీబీ కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.