క్రైమ్/లీగల్

నిర్భయ కేసులో నేడు హైకోర్టు తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై స్టేను సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి సురేష్ కుమర్ కైత్ కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను శని, ఆదివారాలు విచారించారు. ఈనెల 2న తీర్పును కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలుపై తదుపరి ఆదేశాలిచ్చేవరకూ ముందుకెళ్లవద్దని జనవరి 31న హైకోర్టు ఆదేశించింది. మరణశిక్ష అమలుపై స్టే విధించింది. నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో ముకేష్ కుమార్ సింగ్(32), పవన్ గుప్తా(25), వినయ్‌కుమార్ శర్మ(26), అక్షయ్ కుమార్(31)ను ట్రయల్ కోర్టు దోషులుగా తేల్చింది. నలుగురు దోషులు తీహార్ జైలులో ఉరి కంబం ఎక్కేందుకు ఎదురు చూస్తున్నారు. ఇలా ఉండగా నిర్భయ తల్లిందండ్రులు హైకోర్టును ఆశ్రయించి కేంద్రం పిటిషన్‌పై సాధ్యమైనంత త్వరగా ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. ఇలా ఉండగా నలుగురు ముద్దాయిలను జనవరి 22 ఉదయం 7 గంటలకు ఉరి తీయాలని జనవరి 7న కోర్టు బ్లాక్ వారెంట్ జారీ చేసింది. అయితే ముద్దాయిల్లో ఒకడు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ రాష్టప్రతి వద్ద పెండింగ్‌లో ఉండడంతో ఉరిశిక్ష అమలకు అవరోధం ఏర్పడింది. దీంతో జనవరి 17న ట్రయల్ కోర్టు మరోసారి శిక్ష అమలుకు తేదీ ఖరారు చేసింది. ఫిబ్రవరి 1 ఉదయం 6 గంటలకు ముద్దాయిలకు ఉరిశిక్ష అమలుచేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే ట్రయల్ కోర్టు మరోసారి జనవరి 31న ఉరి శిక్ష అమలుపై స్టే ఇచ్చింది. ముద్దాయిలు పవన్, అక్షయ్, వినయ్ న్యాయపరంగా తమకున్న అవకాశాలను వినియోగించుకోడానకి అవకాశం ఇవ్వాలని, ఉరి శిక్ష అమలు నిరవధికంగా వాయిదా వేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ముద్దాయిల తరఫున న్యాయవాదులు కోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. ఇలా జరుగుతుండగా వినయ్, ముకేష్ క్షమాభిక్ష పిటిషన్లు రాష్టప్రతి తోసిపుచ్చారు. అప్పటికింకా పవన్ గుప్తా పిటిషన్ వేయలేదు. అయితే అక్షయ్ కుమార్ ఫిబ్రవరి 1న రాష్టప్రతికి క్షమాభిక్ష పిటిషన్ అందజేశాడు. అదే రోజు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. ఉరిశిక్ష అమలుపై విధించిన స్టేను రెండు ప్రభుత్వాలు సవాల్ చేశాయి. సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో తన వాదన వినిపిస్తూ శిక్ష అమల్లో కాలయాపన చేయాలన్న ఉద్దేశంతోనే ముద్దాయిలు పిటిషన్ల పేరుతో కోర్టును ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు. 2012 డిసెంబర్ 16-17న పారామెడికల్ విద్యార్థినిపై ఆరుగురు మృగాళ్లు తెగబడ్డారు.
నడుస్తున్న బస్సులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడి, ఆమెను బస్సులోంచి గెంటేశారు. నిర్భయ స్నేహితుడినీ చిత్రహింసలకు గురిచేశారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు ఆరుగురు రేపిస్టులను అరెస్టు చేశారు. బాధితురాలిని సింగపూర్‌లోని వౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రికి తరలించగా డిసెంబర్ 29న చికిత్స పొందుతూ చనిపోయింది. ఆరుగురు రేపిస్టుల్లో ఒకడు మైనర్ కావడంతో జువెనల్ కోర్టు అతడికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. పునరావాస కేంద్రంలో శిక్ష అనుభవించిన తరువాత అతడ్ని విడుదల చేశారు. ఐదుగురిలో ఒకడు రామ్‌సింగ్ తీహార్ జైలులో విచారణ ఖైదీగా ఉండగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నలుగురు మృగాళ్లకు ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షను హైకోర్టు సమర్ధించింది. అలాగే రెండు న్యాయస్థానాల తీర్పును సుప్రీం కోర్టు ఖరారు చేసింది.