క్రైమ్/లీగల్

సహకార ఉద్యోగి ఆస్తులు కోటి 75 లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం: ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నారనే ఆరోపణలపై మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విశాఖ జిల్లా మాకవరపాలెం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో స్ట్ఫా అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న శీరంరెడ్డి గోవిందతో పాటు అతని బంధువుల ఇళ్ళలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో కోటి 75 లక్షల రూపాయల విలువైన ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారుల తనిఖీల్లో నిర్థారించారు. తనిఖీలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఏసీబీ ఏఎస్పీ షకీలాబేగమ్ విలేఖరులతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. మాకవరపాలెం పీఏసీఎస్‌లో శీరంరెడ్డి గోవింద 1996 నుండి స్ట్ఫా అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందడంతో మంగళవారం తెల్లవారు జామున నాలుగు గంటలకు నాలుగు బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నర్సీపట్నం శారదానగర్‌లో నివాసం ఉంటున్న శీరంరెడ్డి గోవింద, సొసైటీ కార్యదర్శి శెట్టి గోవింద, బలిఘట్టంలోని బంధువుల ఇళ్ళలో తనిఖీలు చేపట్టారు. సొసైటీ కార్యదర్శి శెట్టి గోవింద ఇంట్లో ఏమీ లభించక పోవడంతో సొసైటీలోని రికార్డులను పరిశీలించారు. శారదానగర్‌లోని శీరంరెడ్డి గోవింద ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో 2019లో బలిఘట్టం గ్రామంలో 323 చదరపు గజాల ఇంటి స్థలం, మరో ముగ్గురి పేరుతో కొనుగోలు చేసిన 295 చదరపు గజాల స్థలం, మాకవరపాలెం మండలం రామన్నపాలెం గ్రామంలో 8.44 ఎకరాల వ్యవసాయ భూమి, 87 సెంట్లు ఇంటి స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. గోవింద భార్య కృష్ణవేణి పేరుతో 2019లో బలిఘట్టంలో కొనుగోలు చేసిన 30 సెంట్లు స్థలం, 2014లో కొనుగోలు చేసిన 39 సెంట్లు స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా లభ్యమైనట్లు ఏఎస్పీ తెలిపారు. గోవిందు ఇంట్లో వందకు పైగా ప్రాంసరీ నోట్ల నుండి 55.88 లక్షల రూపాయలు, మార్ట్ గేజ్ డీడ్‌గా లక్ష రూపాయలు, బ్యాంకు బ్యాలెన్స్ 45,288 రూపాయలు, 28 వేల రూపాయల నగదు, ఇంట్లోని వస్తువులకు సంబంధించి 87 వేల రూపాయలు, 347 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించినట్లు ఏఎస్పీ వెల్లడించారు. హీరోహోండా మోటార్ సైకిల్‌ను కూడా గుర్తించామన్నారు. ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించి గోవిందపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. తనిఖీల్లో ఏసీబీ డీఎస్పీ రంగరాజు, సీఐలు అప్పారావు, గఫూర్, రమేష్, లక్ష్మణమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.