క్రైమ్/లీగల్

తల్లీకూతురు హత్య కేసులో నిందితుడికి ఉరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు లీగల్: బంగారు నగల కోసం పట్టపగలు అక్రమంగా ఇంటిలోకి ప్రవేశించి తల్లీ, కుమార్తెను అతి దారుణంగా హత్య చేసినట్టు నమోదయిన కేసులో నిందితుడు షేక్ ఇంతియాజ్‌పై ఆరోపణలు సాక్ష్యాధారాలతో రుజువైనందున అతడికి ఉరిశిక్ష విధిస్తూ నెల్లూరు ఎనిమిదవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి బి సత్యనారాయణ గురువారం తీర్పు చెప్పారు. నెల్లూరు నగరంలో 2013లో సంచలనం కలిగించిన కేసు వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు నగరం హరనాథపురం లో అశోది దినకర్‌రెడ్డి బ్రహ్మదేవం గ్రామంలో ఉన్న వాగ్దేవి ఫార్మసీ కళాశాల కరస్పాండెంట్. ఈయన భార్య శకుంతల. కాగా, భార్గవి వీరి కుమార్తె. భార్గవి నారాయణ మెడికల్ కళాశాలలో మూడో సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతోంది. కాగా, దినకర్‌రెడ్డి కొత్తగా నిర్మిస్తు న్న ఇంటికి బిల్డింగ్ ఎలివేషన్, డిజైన్ పనులకు బాలాజీనగర్‌కు చెందిన షేక్ ఇంతియాజ్‌ను నియమించాడు. బిల్డింగ్ పనులు చర్చించడానికి గాను నిందితుడు తరచూ దినకర్‌రెడ్డి ఇంటికి వచ్చేవాడు. ఈ నేపథ్యంలో బిల్డింగ్ డిజైన్‌ల గురించి శకుంతల, భార్గవిలతో కూడా చర్చించేవాడు. కాగా, పాత నేరస్తుడైన ఇంతియాజ్ కన్ను మహిళలపై పడింది. ఎలాగైనా వారి నగలను కాజేయాలనే దురుద్దేశం వెంటాడింది. ఈ నేపథ్యంలో 2013 ఫిబ్రవరి 12న
దినకర్‌రెడ్డి ఫార్మసీ కళాశాలకు వెళ్లిన సమయం చూసుకుని మధ్యా హ్నం 2 గంటల సమయంలో ఇంటిలో ఒంటరి గా ఉన్న శకుంతల, ఆమె కుమార్తె భార్గవిలపై ఇంతియాజ్ అతని ఇద్దరు సహాయకులు (మైనర్ బాలురు (వంశీకృష్ణ, మురళిమనోహర్) లతో హరనాథపురంలో ఉన్న దినకర్ ఇంటిలోకి వచ్చా డు. ఇంతియాజ్ వచ్చిన విషయాన్ని వైద్య విద్యార్థిని భార్గవి తన తండ్రి దినకర్‌రెడ్డికి తక్షణమే ఫోన్ ద్వారా తెలిపింది. తరువాత ఇంతియాజ్ వంట గదిలోకి వెళుతున్న శకుంతలను గట్టిగా పట్టుకుని కత్తితో ఆమె మెడ కోసి, ఆమె ఒంటి మీ ద నగలు తీసుకున్నాడు. శకుంతల కాళ్లు, చేతులను గట్టిగా ఇతనితో వచ్చిన మైనర్ బాలురులు పట్టుకున్నారు. ఈ హఠాత్పరిమాణంతో నిశే్చష్టురాలైన భార్గవిని ఇంతియాజ్ గట్టిగా పట్టుకుని కత్తితో అతి దారుణంగా ఆమెమెడ మీద పొడిచి హత్య చేశాడు. కొంతసేపటికి దినకర్ తన ఇంటికి ఏదో విషయమై ఫోన్ చేయగా, కుటుంబ సభ్యు ల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో అనుమానం వచ్చిన
ఫిర్యాది దినకర్ తక్షణం హరనాథపురంలోని తన ఇంటికి మరో స్నేహతుడితో కలసి వచ్చాడు. లోపల జరిగిన సంఘటనలను వెనుక వైపు నుంచి వెళ్లిన దినకర్ స్నేహితుడు గమనించి కేకలు వేశాడు. దీంతో కంగారుపడిన ఇంతియాజ్ తలుపు వద్ద నిలుచి ఉన్న దినకర్‌పై పెప్పర్ స్ప్రే చల్లి పరారయ్యాడు. ఈ సంఘటనతో బెంబేలెత్తిన ఇద్దరు మైనర్ బాలురు అదే ఇంటిలోని బెడ్ రూమ్‌లో దాక్కున్నారు. ఈ సంఘటనలో తేరుకున్న దినకర్ ఇంటిలో రక్తపు మడుగులో పడి ఉన్న భార్య శకుంతల, కుమార్తె భార్గవిలను స్థానిక బొల్లినేని ఆసుపత్రికి తరలించగా, వారు అప్పటికే మరణించినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. దీనిపై దినకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నెల్లూరు పట్టణ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కాగా, ఇదే కేసులో బాల నేరస్థులుగా ఉన్న ఇద్దరు బాల నిందితులకు రెండేళ్ల క్రితం జునైవల్ కోర్టు మూడేళ్లు జైలు శిక్ష విధించింది. కాగా, ప్రధాన నిందితుడైన షేక్ ఇంతియాజ్‌పై ఎనిమిదవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ ప్రారంభించి సాక్షులను విచారించారు. ఈ కేసులో నిందితుడు దారుణంగా తల్లీకూతురును హత్య చేసినట్టు రుజువు కావడంతో ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం నిందితుడు ఇంతియాజ్‌కు ఉరి శిక్ష విధించారు. అలాగే, ఐపీసీ 307, 449 సెక్షన్ల కింద నిందితుడు ఇంతియాజ్ చనిపోయే వరకు జీవిత ఖైదీ విధించారు. అలాగే 397 కింద నిందితుడు ఇంతియాజ్‌కు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ఈ శిక్షణలు అన్నింటిని నిందితుడు ఏకకాలంలో అనుభవించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ కేసును అప్పటి పట్టణ డీఎస్‌పీ పి వెంకటనాథ్‌రెడ్డి దర్యాప్తు చేశారు. ప్రాసికూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాదుప్రసాద్ వాధించారు.