క్రైమ్/లీగల్

రాష్ట్రాలకు నిర్బంధం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉద్యోగ నియామకాల్లో నిర్భందంగా రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం రాష్ట్రాలకు లేదని సుప్రీం కోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. అలాగే పదోన్నతుల్లో కోటా కోసం పట్టుబట్టడం అన్నది ఎవరికీ ప్రాథమిక హక్కు కాదని న్యాయమూర్తులు జస్టిస్ ఎల్. నాగేశ్వర రావు, జస్టిస్ హేమంత్ గుప్తతో కూడిన సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. రిజర్వేషన్లు కల్పించాలంటూ రాష్ట్రాలను ఏ న్యాయస్థానం ఆదేశించజాలదని కూడా సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎస్‌సీ, ఎస్‌టీలకు రిజర్వేషన్లు కల్పించకుండా 2012 సెప్టెంబర్ 5న అప్పటి ఉత్తరాఖండ్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ విభాగాల్లో నియామకాలు జరిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉత్తరాఖండ్ హైకోర్టులో సవాల్ చేశారు. ఆ నిర్ణయాన్ని కోర్టు కొట్టి వేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ప్రభుత్వ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్రాలను ఆదేశించకూడదన్న అంశం చట్టంలో స్పష్టంగా ఉందని తెలిపింది. అలాగే పదోన్నతుల్లో ఎస్‌సీ, ఎస్‌టీలకు నిర్భందంగా రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం రాష్ట్రాలకు లేదని వెల్లడించింది. అయితే సదరు రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైన ప్రతిపాదన చేయాలని భావిస్తే అందుకు సంబంధించి పరిమాణాత్మక వివరాలను సేకరించాలని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్‌సీ, ఎస్‌టీలకు తగిన రీతిలో ప్రాతినిధ్యం లేదని నిర్థారించుకున్నప్పుడే తన విచక్షణాధికారం ఉపయోగించుకోవాలని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఎస్‌సీ, ఎస్‌టీలకు రిజర్వేషన్లు కల్పించకుండా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూ 2012లో అప్పటి ఉత్తరాఖండ్ ప్రభుత్వం
తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు ధృవీకరించింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అన్యాయమైనదిగా ఉత్తరాఖండ్ హైకోర్టు కొట్టి వేసి ఉండదని కూడా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగ నిబంధనలను ప్రస్తావించింది. ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలా? వద్దా? అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమని స్పష్టం చేసింది. ప్రభుత్వ సర్వీసుల్లో ఎస్‌సీ, ఎస్‌టీలకు సరైన ప్రాతినిధ్యం లేదని రాష్ట్ర ప్రభుత్వం భావించే పక్షంలో అందుకు సంబంధించి కోటాను కల్పించడానికి రాష్ట్రాలకు రాజ్యాంగంలోని 16(4) అలాగే 16(4ఎ) అధికరణలు అధికారాన్ని కల్పిస్తున్నాయని సుప్రీం కోర్టు తెలిపింది. 16వ అధికరణలోని 4వ క్లాజు, 4ఎ క్లాజులో విషయ స్పష్టత ఉందని, సరైన ప్రాతినిధ్యం లేకపోతే అనే విషయం వీటిలో స్పష్టంగా ఉందని సుప్రీం కోర్టు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు సంతృప్తి చెందితేనే అనే భావన కూడా కల్పిస్తున్నాయని ధర్మాసనం వెల్లడించింది.