క్రైమ్/లీగల్

ఒమర్ అబ్దుల్లా నిర్బంధం అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రజాభద్రత చట్టం కింద కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను దీర్ఘకాలంగా నిర్బంధంలో ఉంచడాన్ని సవాల్ చేస్తూ ఆయన సోదరి సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒమర్ అబ్దుల్లాను ఇంత కాలం నిర్బంధంలో ఉంచడం అన్నది పూర్తిగా అన్యాయమని, ఆయన వల్ల ప్రజాజీవనానికి ఏ రకంగానూ ముప్పువాటిల్లే అవకాశం లేదని సారా అబ్దుల్లా తెలిపారు. రాజ్యాంగంలోని 370-అధికరణ రద్దును వ్యతిరేకిస్తున్న వారి నోరు మూయించడానికే సీఆర్‌పీసీ చట్టం కింద అధికారులు తన సోదరున్ని నిర్బంధంలో ఉంచారని అన్నారు. కేవలం ఒమర్ అబ్దుల్లానే కాకుండా మొత్తం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ముఖ్య నాయకులను, ఇతర పార్టీల ముఖ్య నాయకులను కూడా నిర్బంధంలో ఉంచారని ఆమె అన్నారు. వీరంతా కూడా భారత దేశం కోసం, దాని రక్షణ, భద్రత కోసం కృషి చేసిన వారేనని సారా అబ్దుల్లా తన పిటిషన్‌లో తెలిపారు. సారా అబ్దుల్లా తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. తక్షణమే ఈ అంశాన్ని జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని ధర్మాసనం విచారణను చేపట్టాలని సిబల్ డిమాండ్ చేశారు. అందుకు కోర్టు అంగీకరించింది. గత ఏడాది ఆగస్టు 4వ తేదీ అర్థరాత్రి ఒమర్ అబ్దుల్లాను హౌస్ అరెస్టు చేశారని, ఆ అరెస్టును సమర్థించుకోవడానికి 1973 నాటి నేర శిక్షాస్మృతిలోని 107 సెక్షన్‌ను ప్రయోగించారని సారా అబ్దుల్లా తెలిపారు. ఇవన్నీ కూడా రాజ్యాంగంలోని 14, 21, 22, అధికరణలను ఉల్లంఘించడమేనని అన్నారు.