క్రైమ్/లీగల్

మద్యం ధరల పెంపు కేసు విచారణ 17కు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 10: మద్యం ధరల పెంపును సవాల్ చేస్తూ మద్యం వ్యాపారుల రాష్ట్ర సంఘం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ 17వ తేదీకి వాయిదా పడింది. బార్ అండ్ రెస్టారెంట్ల లైసెన్స్‌లను డిసెంబర్ మాసంలోనే అర్ధంతరంగా రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కాగా అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వం భంగపాటుకు గురైంది. దీని వల్ల ప్రస్తుతం ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లను మూడో వంతుకు తగిస్తూ ప్రభుత్వం టెండర్‌లను పిలిచినప్పటికీ డ్రా ద్వారా ఎంపిక చేసే ప్రక్రియ నిలిచిపోయింది. ఇదే సమయంలో ప్రభుత్వం కక్ష సాధింపుగానా అన్నట్లు ప్రభుత్వ మద్యం దుకాణాల కంటే బార్‌లలో రేట్లు ఎక్కువగా ఉండేలా అడిషినల్ ఎక్సైజ్ రిటైల్ టాక్స్‌ను పెంచింది. ఈ టాక్స్ పేరిట కొనుగోలు ధరలపై ప్రస్తుతం అమల్లోనున్న రూ. 20 నుంచి రూ. 60లకు పెంచింది. దీని వల్ల ఒక క్వార్టర్ మద్యం ధర ప్రభుత్వ మద్యం దుకాణంలో రూ. 100లు ఉంటే బార్ అండ్ రెస్టారెంట్లలో రూ. 160కి అంటే ఫుల్ బాటిల్‌పై రూ. 240 అధికంగా వసూలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో అమ్మకాలు పడిపోవడంతో పెరిగిన టాక్స్‌ను సవాల్ చేస్తూ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించింది. ఇదిలా ఉండగా అసోసియేషన్ దాఖలు చేసిన మరో పిటిషన్‌పై సోమవారం విచారణ జరగాల్సి ఉండగా తగిన సమయం లేకపోవడంతో మంగళవారానికి వాయిదా పడింది. వాస్తవంగా రాష్ట్రంలోని బార్ అండ్ రెస్టారెంట్లకు 2021 జూన్ వరకు లైసెన్స్ కాల పరిమితి ఉన్నది. పైగా 2020 జూన్ వరకు నిర్ణీత ఫీజు చెల్లింపు కూడా జరిగింది. అయితే డిసెంబర్‌లోనే లైసెన్స్‌లను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై గత రెండు మాసాలుగా స్టే కొనసాగుతోంది.