క్రైమ్/లీగల్

నకిలీ ఆర్జిత టిక్కెట్ల పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: శ్రీవారికి నిర్వహించే అభిషేకం, సుప్రభాత ఆర్జిత సేవలకు సంబంధించి నకిలీ టికెట్లను విక్రయించి సొమ్ము చేసుకుంటున్న చెన్నయ్‌కి చెందిన ఓ ముఠా గుట్టును టీటీడీ విజిలెన్స్ అధికారులు రద్దు చేశారు. ఈ సంఘటనలో రూ. 73వేలు తీసుకుని మోసం చేసినట్లు వెబ్‌సైట్ ద్వారా టీటీడీ విజిలెన్స్ అధికారులకు బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. తిరుమల టూ టౌన్ సిఐ చంద్రశేఖర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నయ్‌కి చెందిన కె.పి.రవినారాయణన్ అనే భక్తుడి నుంచి అతని బంధువు భరత్ అనే వ్యక్తి లతిక్ రాహుల్ అనే దళారులతో చేతులు కలిపి 18 అభిషేకం టికెట్లు, 10 సుప్రభాతం టికెట్లను ఇప్పిస్తానని చెప్పి రూ. 73వేలు తీసుకున్నారు.
ఈ సొమ్మును రవినారాయణన్ ఆన్‌లైన్‌లో బ్యాంకు ద్వారా దళారీకి చెల్లించాడు. డిసెంబర్ 30వ తేదీన వారికి సేవా టికెట్లు ఇచ్చేలా దళారీలు భక్తుడు రవినారాయణన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకు సంబంధించిన టికెట్లను అందజేశారు. ఈ నేపథ్యంలో 2019 డిసెంబర్ 30వ తేదీన రవినారాయణన్ తన కుటుంబ సభ్యులతో కలిసి సుప్రభాతం, అభిషేకం సేవలకు వెళ్లేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ చేరుకున్నాడు. విధి నిర్వహణలో ఉన్న టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆ టికెట్లను పరిశీలించారు. ఈ టికెట్లు నకిలీవని గుర్తించారు. దీంతో భక్తులను విజిలెన్స్ కార్యాలయానికి తీసుకుని వెళ్లి విచారించారు. దీంతో తాము మోసపోయిన తీరును అప్పటి వరకు జరిగిన పరిస్థితులను రవినారాయణన్ టీటీడీ విజిలెన్స్ అధికారులకు పూర్తిగా వివరించాడు. అయితే రవినారాయణన్ తమకు తిరుగు ప్రయాణం అవడానికి సమయం సరిపోదని, తాను చెన్నయ్‌కి వెళ్లి తిరిగి ఫిర్యాదు చేస్తానని చెప్పి వెళ్లిపోయాడు. చెన్నయ్‌కి వెళ్లిన భక్తుడు తన బంధువు భరత్‌కు ఫోన్ చేయడం, అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉండటంతో మరింత ఆవేదనకు లోనయ్యాడు. ఈ క్రమంలో ఈమెయిల్ ద్వారా టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈక్రమంలో విజిలెన్స్ అధికారులు ముందుగా విచారణ సాగించారు. అనంతరం వాస్తవాలను గుర్తించి ఈనెల 5వ తేదీన టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే దళారులను అరెస్టు చేస్తామని సిఐ చెప్పారు. ఇలాంటి బ్రోకర్లను నమ్మి మోసపోవద్దని, నకిలీ వెబ్‌సైట్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లను బుక్ చేసుకోవద్దని సూచించారు.
ఇప్పటికే నకిలీ వెబ్‌సైట్లను టీటీడీ గుర్తించి వాటిని ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. శ్రీవారి దర్శనమైనా, వసతైనా టీటీడీకి సంబంధించిన వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని కోరారు. ఎవరైనా భక్తులు దళారుల వల్ల మోసపోతే తక్షణం పోలీసుల దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటారన్నారు.

*చిత్రం... నకిలీ అభిషేకం, సుప్రభాతం టికెట్లు