క్రైమ్/లీగల్

నిర్భయ దోషులకు డెత్ వారంట్‌పై నేడు విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: నిర్భయ గ్యాంగ్ రేప్, హత్యోదంతంలో దోషులకు తాజాగా డెత్ వారంట్‌లు జారీ చేయాలని మృతురాలి తల్లిదండ్రులు ఢిల్లీ కోర్టును మంగళవారం ఆశ్రయించారు. తక్షణమే ఢిల్లీ కోర్టు స్పందించాలని వారు విజ్ఞప్తి చేశారు. అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా ఈమేరకు దోషులకు నోటీసులు జారీ చేస్తూ ఈ అంశాన్ని బుధవారం విచారించనున్నట్లు పేర్కొన్నారు. నిర్భయ దోషులు చట్టంతో చెలగాటం ఆడుతున్నారనీ.. అందరికీ విసుగు తెప్పించేలా ప్రవర్తిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. దోషులకు మరణశిక్ష అంశంపై ట్రయల్ కోర్టును ఆశ్రయించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మంగళవారం సూచించిన నేపథ్యంలో వీరు ఢిల్లీ కోర్టును ఆశ్రయించి డెత్ వారంట్లు తక్షణమే జారీ చేయాలని ఢిల్లీ కోర్టును డిమాండ్ చేశారు.